Home
Israel Hamas War
Israel Hamas War News
-
Israel: అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్, డాక్టర్లను అరెస్ట్ చేసిన ఇజ్రాయిల్..
Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో గాజా ప్రాంతంలోని అల్-షిఫా ఆస్పత్రి హాట్‌స్పాట్‌గా మారింది. ఈ ఆస్పత్రినే హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్‌గా, ఆయుధాలు దాచేందుకు స్థావరంగా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయిల్ ఆర్మీ ఆధారాలతో బయటపెట్టింది. ఆస్పత్రి కింద టన్నెల్స్, ఇతర ఏర్పాట్లను గుర్తించింది. ఇదే కాకుండా గాజాలోని పలు ఆస్పత్రుల కింద ఇలాంటి నిర్మాణాలే ఉన్నాయని ఇజ్రాయిల్ పేర్కొంది. -
Israel-Hamas War: ఉత్తర గాజాపై హమాస్ నియంత్రణ కోల్పోయింది.. ప్రజలకు ఇజ్రాయిల్ వార్నింగ్..
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయిల్ ఆర్మీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర గాజాపై హమాస్ ఉగ్రవాదులు నియంత్రణ కోల్పోయారని గాజా ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది. ఇజ్రాయిల్-హమాస్ సంధి నేపథ్యంలో నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. అయితే ఈ ఒప్పందంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ దళాలు తాజా హెచ్చరికలు చేశాయి. -
Benjamin Netanyahu: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా హమాస్‌ని విడిచిపెట్టొద్దు.. “మొసాద్”కి నెతన్యాహు ఆదేశాలు..
Benjamin Netanyahu: హమాస్ ఉగ్రవాదుల దాడిపై ఇజ్రాయిల్ రగిలిపోతోంది. పటిష్టమైన నిఘా వ్యవస్థ, మొసాద్ వంటి అగ్రశ్రేణి గూఢచార వ్యవస్థ ఉన్నప్పటికీ దాడుల్ని అడ్డుకోలేకపోయాయి. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు కేవలం 20 నిమిషాల్లోనే గాజా నుంచి 5 వేల రాకెట్లను ఇజ్రాయిల్ పైకి ప్రయోగించారు. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ బార్డర్ వద్ద నిఘా వ్యవస్థ కళ్లుగప్పి ఇజ్రాయిల్ పౌరుల్ని హతమార్చారు. ఈ ఊచకోతలో 1200 మంది చనిపోగా.. మరో 240 మందిని హమాస్ బందీలుగా గాజాలోకి… -
Israel Palestine Conflict : హమాస్ దాడి తర్వాత గల్లంతైన ఇజ్రాయెల్ యువతి.. 47 రోజుల తర్వాత దొరికిన మృతదేహం
Israel Palestine Conflict : హమాస్ దాడిలో అక్టోబరు 7న అదృశ్యమైన 26 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళ షానీ గబాయ్ మృతదేహాన్ని నవంబర్ 22 బుధవారం స్వాధీనం చేసుకున్నారు. -
Israel-Hamas war: అల్-షిఫా ఆసుపత్రి పై ఇజ్రాయిల్ దాడి.. దక్షిణ గాజాకు క్షతగాత్రులు
బుధవారం ఇజ్రాయిల్ గాజా లోని అల్-షిఫా ఆసుపత్రి పై దాడి చేసింది. -
Israel Attack: కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..200మంది మృతి
Israel Attack: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన తాజా దాడుల్లో కనీసం 200 మంది పాలస్తీనియన్లు మరణించారు. పాలస్తీనా అధికారులు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. -
PM Modi: “ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు”.. ఇజ్రాయిల్-హమాస్ ఒప్పందాన్ని స్వాగతించిన మోడీ..
PM Modi: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ... ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాది ప్రధాని నరేంద్రమోడీ మరోసారి నొక్కి చెప్పారు. బుధవారం జీ 20 సమ్మిట్ వర్చువల్ మీట్లో ఆయన పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు జీ 20 సభ్య దేశాలతో కలిసి నడవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఇజ్రాయిల్- హమాస్ మధ్య బందీల విడుదల ఒప్పందాన్ని ప్రధాని మోడీ స్వాగతించారు. -
Israel-Hamas War: గాజా సంధిలో భారత్ సాయం కోరనున్న ఇస్లామిక్ దేశాలు..
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం, సంధి కోసం ఇస్లామిక్ దేశాలతో పాటు ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్నాయి. అక్టోబర్ 7నాటి దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. 23 లక్షల జనాభా ఉన్న అత్యంత రద్దీ ఉన్న ప్రాంతంపై దాడులు చేయడం వల్ల అక్కడ 13 వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారు. అయితే వీరిలో 5 వేల మంది వరకు చిన్నారులు ఉండటంపై అన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
Israel-Hamas War: “త్వరలోనే శుభవార్త”.. ఇజ్రాయిల్ పీఎం నెతన్యాహు కీలక వ్యాఖ్యలు..
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 7 నాటి దాడిలో హమాస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసి బందీలుగా చేసుకున్న ఇజ్రాయిలీల విడుదలపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని ఈ రోజు మధ్యవర్తిత్వం చేస్తున్న ఖతార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే కాల్పుల విరమణ, బందీల విడుదల ఉంటుందని తెలుస్తోంది. -
Israel-Hamas War: బందీల విడుదలపై చర్చలు చివరి దశకు చేరుకున్నాయి.. ఖతార్ వెల్లడి..
Israel-Hamas War: ఇజ్రాయిల్, హమాస్ మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైన యుద్ధం భీకరంగా సాగుతోంది. హమాస్ ఉగ్రవాదుల రాకెట్ల ద్వారా ఇజ్రాయిల్‌పై దాడి చేయడమే కాకుండా, ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1200 మందిని ఊచకోత కోశారు. 240 మందిని అపహరించి గాజాలోకి బందీలుగా తరలించారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాస్ట్రిప్ లోని హమాస్ స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 13,300 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చాలా మంది చిన్నారులు ఉండటంతో…
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!