ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఇప్పుడు 45వ రోజుకు చేరుకుంది. అయితే అక్టోబర్ 7 దాడుల సూత్రధారి యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ సైన్యం ఇంకా కనుగొనలేకపోయింది. గత వారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు యాహ్యా సిన్వార్‌ను దూషించారు. అతనిని జర్మన్ నియంత హిట్లర్‌తో పోల్చారు. యాహ్యా సిన్వార్ హిట్లర్‌లా దాక్కుంటున్నాడని, గాజా ప్రజలు నిరంతరం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నెతన్యాహు ఆరోపించారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధానికి పరిష్కారం కనుగొనడానికి చైనా మిడిల్ ఈస్ట్ దేశాల సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో పాల్గొన్న మధ్యప్రాచ్య దేశాలు ఇజ్రాయెల్‌పై నిందలు మోపాయి. ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల ఉనికిని తొలగించాలని కోరుకుంటోందని చెప్పారు. సమావేశంలో అన్ని ఇబ్బందులకు ఇజ్రాయెల్‌ను నిందించడం ఎటువంటి పరిష్కారాన్ని ఇవ్వదు.
గత రెండు నెలలకు పైగా ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు తుది దశకు చేరుకుంది. గాజాలో హమాస్‌ను నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో యాక్షన్ కు దిగింది.
World Cup final: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచులో కలకలం రేగింది. ఫ్రీ పాలస్తీనా అంటూ టీషర్ట్, పాలస్తీనా జెండా రంగులు కలిగిన మాస్క్ ధరించిన ఓ వ్యక్తి గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. పిచ్ వద్దకు వచ్చి బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని కౌగిలించుకోవడానికి ప్రయత్నించారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇన్నాళ్లు ఉత్తర గాజాను మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ సైన్యం, ఇప్పుడు దక్షిణ గాజాపై కూడా ఫోకస్ పెట్టింది. శనివారం దక్షిణ గాజాపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 36 మంది మరణించారు. అంతకుముందు ప్రజల రక్షణ కోసం ఉత్తర గాజాను ఖాళీ చేసి దక్షిణ గాజాకు వెళ్లాలని చెప్పిన ఇజ్రాయిల్, ఇప్పుడు అక్కడ హమాస్ టెర్రరిస్టులను టార్గెట్ చేస్తోంది.
Israel-Hamas War: ఇన్నాళ్లు ఉత్తర గాజా ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ ఆర్మీ, ఇప్పుడు హమాస్‌ని పూర్తిగా నిర్మూలించడానికి దక్షిణ గాజాపై కూడా ఫోకస్ చేసింది. దక్షిణ గాజా లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దళం దాడులు చేసింది. శనివారం జరిగిన ఈ దాడుల్లో 32 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గతంలో ఉత్తరగాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ గాజా ప్రజలను హెచ్చరించింది.
Benjamin Netanyahu: ఇజ్రాయిల్- హమాస్ యుద్ధం తీవ్రంగా సాగుతోంది. గాజాపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1400 మందిని హతమార్చడమే కాకుండా.. 240 మందిని బందీలుగా చేసుకుని గాజా స్ట్రిప్ లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత నుంచి గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇప్పటికే అక్కడ ఇజ్రాయిల్ దాడుల వల్ల 11 వేల మంది చనిపోయారు.
Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. ఈ దాడిలో 1400 మందిని హతమర్చాడమే కాకుండా, ఇజ్రాయిల్ లోని 240 మందిని కిడ్నాప్ చేసి గాజాలోకి బందీలుగా పట్టుకెళ్లింది. అయితే ఇందులో ఇప్పటికే కొంతమందిని చంపేసినట్లు తెలుస్తోంది. తాజాగా 19 ఏళ్ల ఇజ్రాయిల్ మహిళా సైనికురాలు హత్యకు గురైనట్లు డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.