Israel–Hamas war: ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితులను భట్టి చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా కనిపిస్తుంది. మొదట రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది.. ఆ తర్వాత ఇజ్రాయెల్-హమాస్ వివాదం కొనసాగుతుంది.. ఇప్పుడు హౌతీ యెమెన్ యుద్ధం ఈ మూడు కారణాల వల్ల థార్డ్ వరల్డ్ వార్ రాబోతుందా? అనే పరిస్థితులతో ప్రపంచం మొత్తం టెన్షన్ పడుతుంది. అయితే, ఇజ్రాయెల్ ఇప్పటికే హమాస్, హిజ్బుల్లాతో యుద్ధం కొనసాగిస్తుంది. ఇప్పుడు హౌతీ తిరుగుబాటుదారులపై దాడి పశ్చిమాసియాలో యుద్ధ పరిధిని పెంచే అవకాశం ఉంది. ఈ దాడులన్నీ కలిసి పెద్ద యుద్ధంగా మారే అవకాశం ఉంది. హౌతీ సంక్షోభం కారణంగా మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: BJP: దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు రథయాత్ర..
అయితే, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ లేదా హౌతీ రెబల్స్ సంక్షోభం జరిగిన ఎక్కడా కాల్పుల విరమణ ఒప్పందం కనిపించడం లేదు.. ఇజ్రాయెల్ సైన్యం ఈ రోజు గాజా స్ట్రిప్‌పై దాడి చేసింది. ఈ వైమానిక దాడిలో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఇందులో హమాస్ నుక్బా ఫోర్స్ కమాండర్ కూడా హతమైనట్లు తెలుస్తుంది. ఇక, హమాస్ ఆ తర్వాత హిజ్బుల్లా యోధులు ఇజ్రాయెల్‌పై డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగిస్తున్నారు. లెబనాన్ నుంచి దాడులు జరుగుతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో పరిస్థితి గాజా స్ట్రిప్ కంటే దారుణంగా ఉంది.
Read Also: Chandrababu: నేడు అరకు, అమలాపురంలో చంద్రబాబు పర్యటన.. పోలీసుల ఆంక్షలు..
ఇక, రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సైనిక పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో 42 చోట్ల యుద్ధం జరుగుతోందని పేర్కొన్నారు. రాబోయే కొద్ది నెలల్లో ఉక్రెయిన్‌పై రష్యా ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. అప్పుడు అమెరికా దాని మిత్ర దేశాలు అణు దాడి గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాయి. ఏదైనా ఒక దేశం అణు క్షిపణులను ప్రయోగిస్తే మూడవ ప్రపంచ యుద్ధం ప్రమాదం మరింత పెరుగుతుంది.
Read Also: Venkateswara Stotram: శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది.
అలాగే, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు కూడా మరో వైపు మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం కనిపిస్తుంది. ఇక, తాజాగా అమెరికా హౌతీ రెబల్స్ పై దాడి చేసింది. దీంతో పాటు ఇటివల ఇరాన్- పాకిస్థాన్ మధ్య క్షిపణులతో దాడులు జరిగాయి. ఇక, తాజాగా ఇరు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ఈ సమస్యపై చర్చించుకుని యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి యుద్ధాలను నిలిపివేయకపోతే మూడవ ప్రపంచ యుద్ధం అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.