Iran: శాటిలైట్ ‘సొరయా’ని ప్రయోగించిన ఇరాన్.. వెస్ట్రన్ దేశాల్లో ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: మొన్నటి వరకు ఉత్తర కొరియా అమెరికాతో సహా వెస్ట్రన్ దేశాలకు సవాల్ విసురుతూ.. శాటిలైట్‌ని అంతరిక్షంలోకి పంపగా, తాజాగా ఇరాన్ తన శాటిలైట్ ‘సొరయా’ని విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC) ఆంక్షలను ధిక్కరించి ప్రయోగాన్ని చేపట్టింది. ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ సోరయా శాటిలైట్‌ని భూ ఉపరితలం నుండి 750 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది.
ఇరాన్ తన బాలిస్టిక్ మిస్సైళ్లను మెరుగుపరుస్తుందనే వెస్ట్రన్ దేశాల భయాల నేపథ్యంలో ఈ ప్రయోగం జరిగింది. మూడు దశల రాకెట్‌తో ఈ సోరయా శాటిలైట్‌ని ఉంచినట్లు ఇరాన్ అధికారిక IRNA వార్తా సంస్థ తెలిపింది. అయితే, ఇది ఏ తరహా శాటిలైట్ అనే వివరాలను వెల్లడించలేదు. ఈ ప్రయోగం ఇరాన్ పౌర అంతరిక్ష కార్యక్రమంతో పాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అంతరిక్ష కార్యక్రమంలో భాగమని నివేదిక తెలిపింది.
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
Read Also: Suicide: రూ.500 కోసం భార్యాభర్తలు ఆత్మహత్య
ఇరాన్ యూఎన్ భద్రత మండలి తీర్మానాన్ని ధిక్కరిస్తోందని అమెరికా గతంలో పేర్కొంది. అణ్వాయుధాలను రవాణా చేయగల బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించవద్దని ఆంక్షలు విధించింది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలకు అవసరమైన నాణ్యమైన యురేరియం ఉందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చీఫ్ హెచ్చరించారు.
మరోవైపు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇరాన్ పాత్ర ఉందని, ఎర్ర సముద్రంలో వెస్ట్రన్ దేశాలతో పాటు ఇజ్రాయిల్‌తో సంబంధం ఉన్న నౌకలపై యెమెన్ హౌతీలు దాడులు చేస్తున్నారు. దీని వెనక కూడా ఇరాన్ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఇటీవల ఇరాన్, పాకిస్తాన్ లోని బలూచిస్తాన్‌పై వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ కూడా ఇరాన్‌పై దాడులు నిర్వహించింది.
తాజావార్తలు
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!