Ishan Kishan: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఇషాన్ కిషన్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన ఇషాన్ బ్యాటింగ్ అభిమానులను అలరించింది. ఈ క్రమంలో అతడు తన పేరిట కొత్త రికార్డులు నమోదు చేసుకున్నాడు. ఒక వన్డేలో 7 సిక్సులు కొట్టిన రెండో భారత యంగెస్ట్ ప్లేయర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. గతంలో రిషబ్ పంత్ పేరిట ఈ రికార్డు ఉండేది. పంత్ 23 ఏళ్ల 173…
రాంచీ వేదికగా జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ప్రొటీస్ జట్టుపై గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 45.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
Ricky Ponting Chose Rishabh Pant Over Ishan Kishan For T20 World Cup: టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీకి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. భారత జట్టులో ఏయే ఆటగాళ్లకి చోటిస్తే బాగుంటుందన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈసారి చాలామంది ఆటగాళ్లు లైనప్‌లో ఉండటంతో, ఎవరికి చోటు దక్కుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే.. కొందరు మాజీలు మాత్రం రిషభ్ పంత్‌ని తీసుకోవద్దని సూచిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్, ఆ సిరీస్‌లో బ్యాట్స్‌మన్‌గా…
వర్షం కారణంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్ రద్దయ్యింది. తొలుత దోబూచులాడిన వరుణుడు.. ఆ తర్వాత ఏకధాటిగా పడడంతో మ్యాచ్‌ని రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో.. ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్ 2-2తో సమం అయ్యింది. తొలి రెండు మ్యాచ్‌లను దక్షిణాఫ్రికా కైవసం చేసుకోగా.. ఆ తర్వాత భారత్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయాలు నమోదు చేసింది. కాగా.. టాస్ వేయడానికి ముందు నుంచే వాతావరణ…
గత మూడేళ్ల నుంచి టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోన్న దినేశ్ కార్తీక్.. ఎట్టకేలకు దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కంబ్యాక్ ఇచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో బెస్ట్ ఫినిషర్‌గా అవతరించి, జట్టులో చోటు సంపాదించాడు. ఈ సిరీస్‌లోనూ అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దినేశ్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని మాజీలు, క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్ననారు. తాజాగా ఈ జాబితాలోకి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ కూడా చేరిపోయాడు. ‘‘ప్రస్తుతం…
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టులో సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై క్రీడాభిమానుల నుంచి ఏ స్థాయిలో అసంతృప్తి వ్యక్తమైందో అందరికీ తెలిసిందే! కొందరు మాజీలు సైతం అతడ్ని సెలక్ట్ చేయనందుకు పెదవి విరిచారు. అతడో గొప్ప ఆటగాడని, అవకాశాలు ఇస్తేనే సత్తా చాటుకోవడానికి వీలుంటుందని, కానీ ఎందుకు అతడ్ని జట్టులో తీసుకోవడం లేదో అర్థం కావడం లేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అటు, క్రీడాభిమానులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐపీఎల్లో…
టీ20 వరల్డ్‌కప్-2022కి మరెంతో సమయం లేదు. అక్టోబర్ 16వ తేదీ నుంచి ఇది ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే.. భారత జట్టులో ఏయే ఆటగాళ్లను తీసుకోవాలన్న విషయంపై మాజీలు తమ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తాజాగా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇషాన్ కిషన్‌ను కచ్ఛితంగా తీసుకోవాల్సిందేనని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లలో కిషన్ బాగా రాణించగలడని, ముఖ్యంగా బ్యాక్‌ఫుట్ షాట్లు ఆద్భుతంగా ఆడగలడని ఆయన తెలిపాడు. గంభీర్ మాట్లాడుతూ.. ‘‘ప్లేయింగ్…