IND Playing XI vs WI for 4th T20I: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో మ్యాచ్ శనివారం జరగనుంది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన విండీస్.. ఈ టీ20 గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు భారత్ నాలుగో టీ20 గెలిచి సిరీస్ రేసులో నిలవాలని భావిస్తోంది. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. టీమిండియాకు కీలకమైన ఈ మ్యాచ్ ప్లేయింగ్ 11ను ఓసారి చూద్దాం.
వెస్టిండీస్‌తో జరుగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో శుభమాన్ గిల్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో గిల్ ఫ్లాప్ అయ్యాడు. సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దాంతో గిల్ స్థానంలో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ మళ్లీ జట్టులోకి రానున్నాడు. యశస్వి జైస్వాల్ జతగా ఇషాన్ ఆడే అవకాశం ఉంది. ఈ ఇద్దరు ఆరంభం నుంచే హిట్టింగ్ చేస్తారు కాబట్టి.. భారీ పరుగులు వస్తాయని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
మూడో టీ20లో హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగనున్నాడు.నంబర్ 4 బ్యాట్స్‌మెన్‌గా తిలక్ వర్మ ఆడడం ఖాయం. ఆపై వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు మరో అవకాశం లభించనుంది. 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేయనున్నాడు. 7వ స్థానంలో అక్షర్ పటేల్‌కు అవకాశం దక్కనుంది. స్పిన్ విభాగంలో యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లకు.. పేస్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్‌లకు చోటు దక్కనుంది. పాండ్యా, అక్షర్ ఆల్‌రౌండర్‌లుగా జట్టుకు ఉపయోగపడనున్నారు.
Also Read: Virat Kohli Instagram Post: ‘కింగ్’ కోహ్లీతో అట్లుంటది మరి.. ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు!
భారత జట్టు (అంచనా):
యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శాంసన్ (కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్.