Rohit Sharma: రేపు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డేలో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ సిరీస్‌లో బలమైన టీమ్‌తో తాము ఆడబోతున్నామని.. తమ శక్తి సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి తమకు ఇది మంచి అవకాశమని రోహిత్ అన్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో ఆడని ఇషాన్ కిషన్‌కు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అవకాశం కల్పిస్తామని.. అతడిని మిడిల్ ఆర్డర్లో పంపిస్తామని రోహిత్ స్పష్టం చేశాడు. సిరాజ్ బౌలింగ్ అద్భుతంగా వేస్తున్నాడని..…
IND vs SL 3rd ODI: భారత్, శ్రీలంక మధ్య నేడు తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా చివరిదైన మూడో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మూడు వన్డేల సిరీస్ లో రెండు వన్డేలు గెలిచి టీం ఇండియా ఫుల్ జోష్ లో ఉంది. మూడో వన్డేలో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు రెండు వన్డేల్లో దారుణ పరాజయం చవిచూసిన శ్రీలంక మూడో వన్డేలో గెలిచైనా…
Team India: టీమిండియాలో టీ20 ఫార్మాట్‌కు సంబంధించి ప్రస్తుతం వికెట్ కీపర్ స్థానం ఖాళీగా కనిపిస్తోంది. రిషబ్ పంత్ గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌కు వరుస అవకాశాలను కట్టబెడుతున్నారు. అయితే అతడు ఒక్క మ్యాచ్ ఆడితే ఆరు మ్యాచ్‌లు ఆడకుండా జట్టును కష్టాల్లోకి నెడుతున్నాడు. వన్డేల్లో ఇటీవల డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ శ్రీలంకతో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. 37 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే…
Gautham Gambhir: టీమిండియా వన్డే ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న వేళ టీమ్ కాంబినేషన్‌పై రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో రోహిత్‌కు జోడీగా ఇషాన్ కిషన్‌ను ఆడించాలని సూచించాడు. బంగ్లాదేశ్ పర్యటనలో డబుల్ సెంచరీతో ఇషాన్ కిషన్ రాణించిన విషయాన్ని గంభీర్ గుర్తుచేశాడు. ఇంతకంటే ఇషాన్ కిషన్ సత్తాకు నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించాడు. దీంతో ఓపెనర్ల విషయంలో ఎలాంటి సందేహాలకు తావు ఇవ్వకుండా సెలక్టర్లు…
Team India: టీమిండియా యువ ఓపెనర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఒక్క ఇన్నింగ్స్‌తో సమీకరణాలన్నీ మార్చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేయడంతో బీసీసీఐ దృష్టిలో కూడా పడుతున్నాడు. ఈ నేపథ్యంలో 2023-24కు సంబంధించిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోకి ఇషాన్ కిషన్ చోటు దక్కించుకోనున్నాడు. ఈనెల 21న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను ఖరారు చేయనున్నారు. కొన్నాళ్లుగా టీమిండియా తరఫున ఆడుతున్నా ఇషాన్ కిషన్‌కు సెంట్రల్ కాంట్రాక్టు దక్కలేదు. కానీ ఇప్పుడు…
IND Vs BAN: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా విజయంతో ముగించింది. ఇప్పటికే రెండు వన్డేలలో ఓటమి చెంది సిరీస్ కోల్పోగా శనివారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా విశ్వరూపం చూపించింది. దీంతో బంగ్లాదేశ్‌పై 227 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం సాధించింది. 410 పరుగుల అతి భారీ లక్ష్యఛేదనలో ఆతిథ్య బంగ్లాదేశ్ 182 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లందరూ సమష్టిగా రాణించారు. శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా ఉమ్రాన్ మాలిక్, అక్షర్…
IND Vs BAN: బంగ్లాదేశ్ పర్యటనలో తొలి రెండు వన్డేల్లో ఓడి సిరీస్ కోల్పోయిన టీమిండియా ఎట్టకేలకు జూలు విదిల్చింది. మూడో వన్డేలో భారీ స్కోరు చేసింది. చిట్టగ్రామ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఇషాన్ కిషాన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతడు కెరీర్లో చేసిన తొలి వన్డే సెంచరీని చిరస్మరణీయం చేసుకున్నాడు. 131 బంతుల్లో 10 సిక్సర్లు, 24 ఫోర్లతో ఇషాన్…