Rohit Sharma explains why India Innings Declares Late in 1st Test vs West Indies: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టింది. విండీస్‌పై ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ (171), కెప్టెన్ రోహిత్ శర్మ (103) సెంచరీలు చేయగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (76) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (12/131) తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25ని భారత్ ఘనంగా ప్రారంభించింది.
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘దేశం కోసం చేసే ప్రతి పరుగూ ఎంతో విలువైంది. మేం బౌలింగ్‌ను బాగా ప్రారంభించాం. అందుకే విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌట్ చేయగలిగాం. ఈ పిచ్ మీద బ్యాటింగ్ కష్టమని మాకు తెలుసు. క్రీజ్‌లో కుదురుకుని నిలకడగా ఆడితే పరుగులు వస్తాయని అనుకున్నాము. మేము ఎక్కువసేపు బ్యాటింగ్ చేశాం. 400కిపైగా పరుగులు చేయడంతో మా బౌలర్లకు పూర్తి స్వేచ్ఛ లభించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ విండీస్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశారు’ అని అన్నాడు.
Also Read: Ashwin-Harbhajan: హర్భజన్ సింగ్ రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్.. ఇక అనిల్ కుంబ్లే టార్గెట్!
‘యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కు మంచి ప్రతిభ ఉంది. ఎప్పటి నుంచో జట్టు కోసం సిద్ధమవుతూ ఉన్నాడు. తొలి టెస్టులోనే చాలా అద్భుతంగా ఆడాడు. ఎక్కడా కంగారు పడలేదు. టీ20ల్లో ప్రదర్శించిన దూకుడును నియంత్రించుకుంటూ పరుగులు చేసాడు. ఆటను మరింత ఆస్వాదించి ఆడితే పరుగులు వస్తాయని నేను చెప్పా. ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేయడం స్పష్టతతో ఉన్నాం. విరాట్ కోహ్లీ ఔటైన తర్వాత చేద్దామనుకున్నాం. అయితే ఇషాన్ కిషన్ తన తొలి టెస్టు మ్యాచ్లో బ్యాటింగ్ చేయాలని ఆత్రుతగా ఉన్నాడు. అందుకే అతడు సింగిల్ కొట్టిన తర్వాత ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేశాం’ అని రోహిత్ శర్మ చెప్పాడు.
విరాట్ కోహ్లీ ఔటైన తర్వాత ఇషాన్ కిషన్ క్రీజ్‌లోకి వచ్చాడు. అయితే తొలి పరుగు చేయడానికి దాదాపుగా 20 బంతులు ఆడాడు. కిషన్ సింగిల్ తీయగానే భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 421/5 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 150 పరుగులకు ఆలౌటై కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక రెండో టెస్టు జులై 20న ఆరంభం కానుంది.
Also Read: iPhone 14 Price Drop: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 ధర!