వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ టెస్ట్ మ్యాచ్‌తోనే ఇండియా తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఆ ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ మరియు ఇషాన్ కిషన్ ఉన్నారు. యశస్వి తన తొలి మ్యాచ్‌లోనే బ్యాట్‌తో అద్భుతాలు చేసి ప్రశంసలు అందుకున్నాడు. అదే సమయంలో ఇషాన్‌కు బ్యాటింగ్ చేయడానికి పెద్దగా అవకాశం రానప్పటికీ.. వికెట్ల వెనుకాల నుంచి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి.. ఇప్పుడు చర్చలో నిలిచాడు.
Jogi Ramesh: పవన్ ఎక్కడ నుంచి పోటీ చేసినా.. వాలంటీర్‌ని నిలబెట్టి అతడ్ని ఓడిస్తాం
వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు భారత్ విజయం సాధించింది. అయితే మూడో రోజు మ్యాచ్ లో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మధ్య ఇంట్రస్టింగ్ కామెంట్స్ జరిగాయి. వెస్టిండీస్ 11వ నంబర్ బ్యాట్స్‌మెన్ జోమెల్ వారికన్ విజయం.. చివరలో టీమిండియాను ఇబ్బందికి గురి చేశాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు.. ఇంకాస్త సమయం స్టేడియంలో ఉండాల్సి వచ్చింది. వారికన్ 18 బంతుల్లో 18 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్ చూసి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సరదా కామెంట్స్ చేశాడు.
Asian Athletics Championship: ఆసియా అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రా అమ్మాయి..
టీమిండియా వైస్ కెప్టెన్ రహానేతో మాట్లాడిన మాటలు అందరూ షాక్ కు గురయ్యేలా ఉన్నాయి. రహానే కంటే వారికన్ ఎక్కువ బంతులు ఆడాడని ఇషాన్ స్టంప్ మైక్‌లో చెప్పాడు. ఈ సమయంలో రహానే స్లిప్ వద్ద నిలబడి.. ఇషాన్‌ను ఏమి అన్నావని అడిగాడు. ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న రహానే మూడు పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌కు బ్యాటింగ్‌కు పెద్దగా అవకాశం రాకపోయినప్పటికీ.. వికెట్ వెనుక కొన్ని మంచి క్యాచ్‌లను అందుకున్నాడు. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో అద్భుతాలు చేయాలన్నదే అతని ప్రయత్నం. రెండో మ్యాచ్‌లో తనకు బ్యాటింగ్ వస్తుందని, అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాలని ఇషాన్ కిషన్ ఆశిస్తున్నాడు.