Irfan Pathan: విస్తారా ఎయిర్‌లైన్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ముంబై నుంచి దుబాయ్ వెళ్తుండగా విస్తారా సిబ్బంది తనతో అనుచితంగా ప్రవర్తించారని ఇర్ఫాన్ పఠాన్ ఆరోపించాడు. ముంబై నుంచి దుబాయ్ వెళ్లేందుకు విస్తారా విమానం యూకే-201లో టిక్కెట్ బుక్ చేసుకున్నానని.. కానీ చెక్ ఇన్ కౌంటర్ వద్ద తనకు చేదు అనుభవం ఎదురైందని పఠాన్ వివరించాడు. తన భార్య, పిల్లలతో దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నానని..…
ఈమధ్య సీనియర్ ఆటగాళ్లకు సెలెక్టర్లు తరచూ విశ్రాంతినిస్తున్నారు. తీరిక లేకుండా ఆడుతున్నారనో లేక ఫామ్ లేరన్న కారణాన్ని చూపి, సీనియర్స్‌కు రెస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు జులై 22 నుంచి ప్రారంభం కానున్న విండీస్ టూర్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, మహ్మద్ షమీలకు విశ్రాంతి ఇచ్చారు. దీనిపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. విశ్రాంతి ఇస్తే, ఏ ఆటగాడూ ఫామ్‌లోకి తిరిగి రాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రోహిత్…
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఉమ్రాన్ మాలిక్ 22 వికెట్లు తీయడంతో పాటు నిలకడగా 150 కి.మీల వేగంతో బంతులు వేయడంతో.. రానున్న టీ20 వరల్డ్‌కప్‌లో అతడ్ని టీమిండియాలోకి తీసుకోవాలన్న అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు మాజీలు సైతం అతడ్ని తుది జట్టులో ఎంపిక చేయాల్సిందేనని సిఫార్సు చేస్తున్నారు. అయితే.. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది. ఓ క్రీడా ఛానల్ చర్చలో భాగంగా ఉమ్రాన్ గురించి మాట్లాడుతూ..…
ఏదైనా టోర్నీ జరుగుతున్నప్పుడు లేదా ముగిసిన తర్వాత.. మాజీలందరూ తమతమ ఉత్తమ ఆటగాళ్ళని ఎంపిక చేసుకొని, ఒక బెస్ట్ టీమ్‌ని ప్రకటిస్తుంటారు. ఇప్పుడు ఐపీఎల్-2022 ముగియడంతో.. మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన బెస్ట్ ఎలెవన్‌ను అనౌన్స్ చేశాడు. ఇతను హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. హార్దిక్ సారథ్యం వహించిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్-2022 ఛాంపియన్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే! ఈ ఏడాది సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు.. తొలి…
టీ20 ప్రపంచకప్‌లో ఈనెల 24న పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి మ్యాచ్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్‌లలో పాక్‌పై టీమిండియాకు ఓటమి అన్నదే లేకపోవడంతో ఈసారి ఫలితం ఎలా వస్తుందో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో తలపడే టీమిండియా డ్రీమ్ ఎలెవన్‌ను భారత మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రకటించాడు. అయితే ఈ జట్టులో సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు పఠాన్ చోటివ్వలేదు. ఓపెనర్లుగా…