Shardul Thakur: క్రీడాభిమానులు శార్దూల్ ఠాకూర్‌ని ‘ద లార్డ్’గా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే.. అతడు ఎన్నోసార్లు టీమిండియా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కీలక వికెట్లు తీసి గట్టెక్కించాడు. అంతెందుకు.. రీసెంట్‌గానే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి వన్డేలో మ్యాచ్ చేజారుతుందనుకున్న సమయంలో.. చివర్లో బ్రేస్‌వెల్ వికెట్ తీసి, జట్టుని గెలిపించాడు. మిగిలిన రెండు మ్యాచెస్‌లోనూ బాగా రాణించాడు. ఈ నేపథ్యంలోనే.. శార్దూల్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. వన్డే వరల్డ్‌కప్ జట్టులో అతనికి చోటు దక్కుతుందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశాడు.
Prabhas: సింగిల్ కింగులం నుంచి నువ్వెప్పుడూ బయటపడతావ్ డార్లింగ్
ఇర్ఫాన్ మాట్లాడుతూ.. ‘‘శార్దూల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. లోపాలు సవరించుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. బంతిని పెద్దగా స్వింగ్ చేయలేడని మనం భావించినప్పుడల్లా.. మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. కీలక సమయాల్లో వికెట్లు కూడా పడగొడుతున్నాడు. అతడు గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ వేయకపోయినా.. నంబర్ 1గా ఎదుగుతాడు. వరల్డ్‌కప్ జట్టులో ఫాస్ట్‌బౌలర్ల విభాగంలో అతడికి కచ్చితంగా చోటు దక్కుతుందని అంచనా వేస్తున్నా. అంతేకాదు.. ఎనిమిదో స్థానంలో శార్దూల్ బాగా బ్యాటింగ్ చేయగలడు. మిగతా వాళ్లకంటే ఓ అడుగు ముందే ఉంటాడు’’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే.. మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం ఇర్ఫాన్ అభిప్రాయంతో ఏకీభవించలేదు. వరల్డ్‌కప్ జట్టులో శార్దూల్‌కు స్థానం దక్కకపోవచ్చని అన్నాడు. జట్టులో హార్దిక్ పాండ్యా ఉన్నాడని, అతడు పేస్ ఆల్‌రౌండర్ కాబట్టి, శార్దూల్‌కి చోటు కష్టమేనని తేల్చేశాడు.
Pakistan Crisis: పాక్‌లో మరింత ముదిరిన సంక్షోభం.. మంత్రులు, ఉద్యోగాల్లో కోత
కాగా.. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో శార్దూల్ అద్భుత ప్రదర్శనతో సత్తా చాటాడు. మొదటి వన్డేలో 7.2 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చిన రెండు వికెట్లు తీసిన అతడు.. 3 పరుగులు చేశాడు. రెండో వన్డేలో 6 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి, ఒక వికెట్ తీశాడు. ఇక చివరి వన్డేలో 6 ఓవర్లలో 45 పరుగులిచ్చి, 3 వికెట్లు తీశాడు. అంతేకాదు.. 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 25 పరుగులు చేశాడు. బంతితో బాటు బ్యాట్‌తోనూ సత్తా చాటి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
Boyfriend Crime: మరో వ్యక్తితో పెళ్లి.. గొంతు కోసిన ప్రియుడు