ఇరాన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సంస్కరణవాద అభ్యర్థి మసూద్ పెజెష్కియాన్ అధ్యక్ష ఎన్నికల్లో అతివాద అభ్యర్థి సయీద్ జలీలీని ఓడించి విజయం సాధించారు. దేశంలో 49.8 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి మొహసిన్ ఎస్లామీ తెలిపారు.
ఇరాన్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందడంతో శుక్రవారం ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అతివాద నేత సయీద్ జలీలీ, సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్ మధ్య నెలకొంది.