Iran Presidential Elections: ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్
- ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్
- అధ్యక్ష ఎన్నికల్లో సయీద్ జలీలీపై విజయం
- ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో 49.8 శాతం ఓటింగ్ నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Presidential Elections: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సంస్కరణవాద అభ్యర్థి మసూద్ పెజెష్కియాన్ అధ్యక్ష ఎన్నికల్లో అతివాద అభ్యర్థి సయీద్ జలీలీని ఓడించి విజయం సాధించారు. దేశంలో 49.8 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి మొహసిన్ ఎస్లామీ తెలిపారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు దాదాపు 30 మిలియన్ల ఓట్లు పోలయ్యాయి. శుక్రవారం ఎన్నికల తర్వాత అధికారులు సమర్పించిన డేటా పెజెష్కియాన్‌ను 16.3 మిలియన్ ఓట్లతో విజేతగా ప్రకటించగా, జలీలీకి 13.5 మిలియన్ల ఓట్లు వచ్చాయి. ఇరాన్ హార్ట్ సర్జన్, ఎంపీ మసూద్ పెజెష్కియాన్ ఎన్నికల ప్రచారంలో పశ్చిమ దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రజలు సయీద్ జలీలీ కంటే అతనికి అధికంగా ఓట్లేసి గెలిపించారు.
Read Also: Buffalo Solved Problem: బర్రె పంచాయితీని బర్రే.. తేల్చేసింది.. ఎలాగంటే?
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
పెజేష్కియాన్ మద్దతుదారులు శనివారం ఉదయం వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు, ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఎన్నికల ప్రాముఖ్యత గురించి శుక్రవారం వెల్లడించారు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును వినియోగించుకోవాలి.. అధ్యక్షుడిని ఎన్నుకొని దేశ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో అధిక పోలింగ్‌కు ఆయన పిలుపునిచ్చారు. గాజా యుద్ధంపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఇరాన్‌లో ఎన్నికలు జరిగాయి. ఇరాన్‌కు పశ్చిమ దేశాలతో వివాదం ఉన్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా అనేక రకాల ఆంక్షలు దాని ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు దేశాన్ని వృద్ధి దశలో నడిపించాల్సి ఉంటుంది. అన్ని దేశాలతో సత్సంబంధాల కోసం కృషి చేయాల్సి ఉంటుంది.
ఇరాన్ ఎన్నికల సంఘం నుంచి వచ్చిన డేటా ప్రకారం, ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించబడిన ఏకైక సంస్కరణవాద నాయకుడు పెజెష్కియాన్. పెజెష్కియాన్ అభ్యర్థిత్వం గురించి ఇటీవల వరకు పెద్దగా చర్చ జరగలేదు, అయితే మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖతామీ, ఉదారవాది హసన్ రౌహానీల మద్దతు అతని అభ్యర్థిత్వానికి బలాన్నిచ్చింది. ప్రచారం సందర్భంగా, 69 ఏళ్ల పెజెష్కియాన్, ముఖ్యంగా పశ్చిమ దేశాలతో నిర్మాణాత్మక సంబంధాలను, ప్రపంచంలో ఒంటరిగా ఉన్న ఇరాన్ అణు ఒప్పందాన్ని పునరుద్ధరించాలని ఉద్ఘాటించారు.
ఇరాన్‌లో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయాలనేది ఆ దేశ గార్డియన్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. నలుగురు అభ్యర్థుల పేర్లను గార్డియన్ కౌన్సిల్ ఆమోదించింది. తొలి దశలో ఏ అభ్యర్థి కూడా 50 శాతం ఓట్లను సాధించలేకపోయారు. దీని తరువాత, రన్-ఆఫ్ పోల్ నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో మొదటి ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ ఉంది. ఈ పోటీలో, సంస్కరణవాద నాయకుడు మసూద్ పెజెష్కియాన్, సంప్రదాయవాది సయీద్ జలీలీని ఓడించి ఇరాన్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పెజెష్కియాన్ ఎంపీగానే కాకుండా మహ్మద్ ఖతామీ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేశారు. సయీద్ జలీలీ ఇరాన్ మాజీ చీఫ్ న్యూక్లియర్ నెగోషియేటర్.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!