రెండేళ్ల గ్యాప్ తర్వాత ఐపీఎల్ లో మళ్లీ ప్లేఆఫ్స్ ఆడుతున్న ముంబై ఇండియన్స్.. చెన్నైలో లక్నో సూపర్ జెయింట్స్ తో ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ జట్టులో కొత్త కుర్రాళ్లు, 2011 వన్డే వరల్డ్ కప్ లో తనకు అవకాశం రాకపోవడం వంటి విషయాలపై ఆసక్తికర విషయాలు చేశాడు.
Also Read : BJP Chief JP Nadda : విదేశాల్లో ప్రధాని స్వాగతం చూసి భారతీయులు గర్విస్తున్నారు : జేపీ నడ్డా
ముంబై టీమ్ లో జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉండటం వల్లే ఆ జట్టు కప్ గెలిచిందని.. వాళ్లందరూ వెళ్లాక ముంబైకి కష్టాలు మొదలయ్యాయని వచ్చిన విమర్శలకు రోహిత్ స్పందించాడు. ‘బుమ్రా, హార్ధిక్, కృనాల్ స్టోరీ కూడా ప్రస్తుతం ఉన్న తిలక్ వర్మ, నెహల్ వధెర వంటి ఆటగాళ్లే.. రాబోయే రెండేండ్లలో వీళ్లు ముంబై విజయాలలో కీలక పాత్ర పోషిస్తారు అని రోహిత్ చెప్పాడు. ముంబైకే కాదు టీమిండియా తరఫున కూడా స్టార్లుగా మారుతారన్నాడు.
Also Read : TS Eamcet results: నేడే ఎంసెట్ ఫలితాలు.. ఉదయం 9:30 గంటలకు విడుదల చేయనున్న మంత్రి సబితా
ముంబైకి స్టార్లు అవసరం లేదు.. ఈ టీమ్ లోకి వస్తే వారినే స్టార్లుగా తీర్చిదిద్దుతామని రోహిత్ శర్మ అన్నాడు. ఆ మేరకు టీమ్ మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాప్ కృషి చేస్తారని ముంబై సారథి అన్నారు. వేలంలో ఎందరో సూపర్ స్టార్స్ అందుబాటులో ఉన్నా మేనేజ్మెంట్ మాత్రం యువ ఆటగాళ్లను తీసుకుని వారిపై నమ్మకం ఉంచింది.. వారిని భవిష్యత్ సూపర్ స్టార్లుగా తీర్చిదిద్దుతున్నది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.. కామెంట్స్ గురించి మేం పట్టించుకోం’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
Also Read : New York is Sinking: న్యూయార్క్ కాలగర్భంలో కలిసిపోనుందా ?
ఆటగాళ్లకు మద్దతుగా ఉండాలని.. అలా ఉంటేనే వారి నుంచి మంచి ఫలితాలు రాబట్టొచ్చని రోహిత్ అన్నాడు. జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు ఎవరైనా ఏ సమస్యపై అయినా తనను సంప్రదించినా.. టీమ్ ను అడిగినా వారికి అండగా ఉంటామని తెలిపాడు. 2011 వన్డే వరల్డ్ కప్ లో తాను ఎంపిక కాకపోవడం తనను చాలా బాధించిందని అయితే దీనిలో తాను ఎవరినీ నిందించబోనని హిట్‌మ్యాన్ అన్నాడు. దాని తర్వాత తాను తన ఆటపై దృష్టిపెట్టానని.. యోగా, మెడిటేషన్ తో పాటు ఒంటరిగా గడిపానని హిట్ మ్యాన్ చెప్పాడు. అది తన కెరీర్ కు చాలా ఉపయోగపడిందని రోహిత్ వెల్లడించాడు.