టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా గత కొంతకాలంగా తన గర్ల్‌ఫ్రెండ్ నిధి తపాడియాతో రిలేషిన్‌షిప్‌లో ఉన్నారు. అయితే తొలిసారి వీరిద్దిరూ పబ్లిక్‌గా కనపడ్డారు. ఐఐఎఫ్‌ఏ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పృథ్వీ షా, నిధి తపాడియా సందడి చేశారు. గ్రీన్ కార్పెట్‌పై వీరిద్దరూ ఫోటోలకు ఫోజులు ఇస్తు తెగ ఎంజాయ్ చేశారు. పృథ్వీ షా స్లీవ్‌లెస్ జాకెట్, బ్లాక్ షర్ట్, బ్లాక్ జీన్స్ ధరించగా.. నిధి కూడా బ్లాక్ చీరలో మెరిసిపోయింది.
Also Read : YCP vs TDP: బెజవాడలో ఎన్టీఆర్ ఫ్లెక్సీల వివాదం.. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి రాసివ్వలేదు..!
పృథ్వీ షా, నిధి తపాడియాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ షా ఈ సీజన్ లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన షా కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఈ పేలవ ప్రదర్శనతో భారత టీ20 జట్టులో కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశాలను పృథ్వీ షా పూర్తిగా కోల్పోయాడనే చెప్పుకోవాలి. అయితే ఏడాది కాలంగా డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం పృథ్వీ షా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో అస్సాంపై ఏకంగా 379 పరుగులు చేశాడు. కానీ ఐపీఎల్‌లో మాత్రం తన మార్క్ చూపించడంలో అతడు విఫలమయ్యాడు.
Also Read : PM Modi: బాలాకోట్ వైమానిక దాడి, సర్జికల్ స్ట్రైక్స్.. పాక్ వెన్ను విరిచిన మోడీ 9 నిర్ణయాలు
ఐపీఎల్ లో పృథ్వీ షా పేలవ ప్రదర్శనకు అతన్ని కొన్ని మ్యాచ్ లకు డగౌట్ లో కూర్చొబెట్టారు. కానీ మళ్లీ తిరిగి లీగ్ చివరి మ్యాచ్ ల్లో మరోసారి అవకాశం ఇచ్చిన విఫలం అయ్యాడు. ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ నిష్ర్కమించడంతో షా తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడు.