ఐపీఎల్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023 మ్యాచ్ లకు ఇంగ్లాండ్ యంగ్ ప్లేయర్ విల్ జాక్స్ దూరం కానున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఏప్రిల్ 2న ముంబయి ఇండియన్స్ తో తలపడనుంది. అయితే.. గాయం కారణంగా జాక్స్ ఈ మ్యాచ్ కు ఆడలేకపోతున్నాడు. మీర్పుర్ వేదికగా బంగ్లాదేశ్ తో ఇటీవలే జరిగిన వన్డేలో చేస్తున్న సమయంలో విల్ జాక్స్ గాయాలపాలయ్యాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలిచగా.. స్కానింగ్ రిపోర్ట్ లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో డాక్టర్ల సూచన మేరకు చికిత్స పొందుతూ విల్ విశ్రాంతి తీసుకుంటున్నాడు.
Also Read : CM Jagan : సీఎం జగన్ చిత్రపటానికి నాయి బ్రాహ్మణులు పాలభిషేకం
అయితే అతని గాయం కారణ:గా ఇప్పుడు ఐపీఎల్ కు దూరమయ్యాడు. కాగా ఇప్పటి వరకు ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ ఒక్కసారి కూడా ఐపీఎల్ లో ఆడలేదు. అయితే వివిధ దేశాల్లో జరిగిన టీ20 లీగుల్లో మాత్రం ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఇక ఇతరి ఆటకు స్టేడియం మొత్తం దద్దరిల్లిందనే చెప్పొచ్చు.. బంతిని స్టేడియం దాటించి అందరిని ఆశ్చర్యపరిచాడు ఈ యంగ్ ప్లేయర్. ఇంగ్లాండ్ కు చెందిన విల్ జాక్స్ గత ఏడాది అంతర్జతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన పవర్ హిట్టింగ్ స్కిల్స్, ఆఫ్ స్పిన్ టాలెంట్ తో అందరినీ మెస్మరైజ్ చేసిన ఈ ప్లేయర్ ను ఐపీఎల్ 2023 వేలంలో రూ. 3.2 కోట్లకు ఆర్సీబీ ప్రాంచైజీ కొనుగోలు చేసింది.
Also Read : Camel Milk: ఒంటె పాలను తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..!
ఆర్సీబీ టీమ్ లో విల్ జాక్స్ వెళ్లిపోవడంతో అతని స్థానంలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మైకేల్ బ్రాస్ వెల్ ను తీసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు సమాచారం. గతేడాది న్యూజిలాండ్ టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్రాస్ వెల్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ లో జరిగిన టీ20 సిరీస్ లో కివీస్ జట్టు తరపున ఆడాడు. ఇప్పుటి వరకు ఇతను 16 టీ20లు ఆడగా అందులో 21 వికెట్లు పడగొట్టాడు.. అయినప్పటికీ కేవలం 113 పరుగులే స్కోర్ చేశాడు. ఆర్సీబీ జట్టు: ఫాఫ్ డుప్లెసిస్ ( కెప్టెన్ ), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, దినేష్ కార్తిక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, జోష్ హేజిల్ వుడ్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ, సిద్దార్థ్ కౌల్, రీస్ టాప్లీ, హఇమాన్ఫు శర్మ, రాజన్ కుమార్, అవినాశ్ సింగ్, గ్లెన్ మాక్స్ వెల్, వానిందు హసరంగా, మహిపాల్ లోమ్రార్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్. డేవిడ్ విల్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, మనోజ్ భాండాగ్, సోను యాదవ్.