మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ పదహారో సీజన్ ప్రారంభంకానుంది. ఇప్పుడు భారత జట్టు మాజీ ఆటగాడు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెన్నై సూపర్ కింగస్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ సీఎస్కే ప్రధాన బలం మాత్రమే కాదు.. ఆ జట్టుకు గుండెకాయ లాంటివాడు అని ఆయన అన్నారు. అంతేకాదు మహీ తన జట్టులోని ప్రతి ఆటగాడితో అద్బుతాలు చేయించగల సమర్థుడని భజ్జీ వెల్లడించాడు. ధోనికి జట్టు సభ్యులపై పూర్తి అవగాహన ఉంటుంది. అతను ప్రతి ఆటగాడి నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టగల సమర్థుడు.. సొంతగడ్డపై సీఎస్కే ప్రధాన బలం ఏంటంటే.. ఆ టీమ్ ఫ్యాన్స్ వాళ్లు.. సీఎస్కే జట్టు స్పూర్తిని పెంచుతారని భజ్జీ తెలిపారు.
Also Read : 3 Year Old Shoots Sister: బొమ్మ తుపాకీ అనుకొని.. అక్కనే కాల్చి చంపిన చిన్నారి
మ్యాచ్ గెలిచినా.. ఓడినా వాళ్ల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని హర్భజన్ సింగ్ వెల్లడించారు. ఈ సీజన్ లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చెన్నైకి కీలకం కానున్నాడని భజ్జీ అన్నాడు. జడ్డూ సూపర్ ఫామ్ లో ఉన్నాడని.. ప్రపంచంలోను అతనికంటే ఉత్తమ్ ఆల్ రౌండర్ మరొకరు లేరని తెలిపాడు. 16వ సీజన్ లో సీఎస్కే ఎక్స్ ఫ్యాక్టర్ తనేనని మాజీ స్పిన్నర్ వెల్లడించారు. భజ్జీకి ధోనీ కప్టెన్సీలో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. 2018-2020 సీజన్ లలో సీఎస్కే తరపున ఆడాడు.
Also Read : Inter Exams : విద్యార్థులు టెన్షన్ పడొద్దు.. విజయం సాధించాలి..
పదిహేను సీజన్లుగా క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. మార్చి 31న ఈ మెగా ఈవెంట్ షూరు కానుంది. ఆరంభ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ ను ధోనీ సేన ఢీ కొట్టనుంది. ఈ సీజన్ లో ప్రతి జట్టు తమ సొంత గ్రౌండ్ లోఏడు మ్యాచ్ లు ఆడనుంది. అంతేకాదు ఇంప్యాక్ట్ ప్లేయర్ ను తీసుకునే అవకాశం కూడా ఆయా జట్లకు ఉంది. ఐపీఎల్ లో విజయవంతమైన కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ ఒకరు. అతని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు టైటిల్ సాధించింది. 2010.2011,2018,2021లో ఆ జట్టు ఛాంపియన్ గా అవతరించింది. మహీ ఆడనున్న ఆఖరి ఐపీఎస్ సీజన్ బహుశా ఇదే కావొచ్చని ప్రచారం జరుగుతుంది. అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్కే భావిస్తోంది.