ఈ సారి ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్, శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్ల మధ్య రేపు హై టెన్షన్ మ్యాచ్ కి అంతా సిద్ధమైంది. అయితే ఈ రెండు జట్లకు టైటిల్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత రికార్డుల్ని పరిశీలిస్తే ఎలిమినేటర్ ఆడిన జట్టు ఒక్కసారి మాత్రమే టైటిల్ గెలిచింది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఘనత సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 36 మ్యాచ్‌లు విజయవంతంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు బ్యాటర్లు, బౌలర్లు, సిక్సర్లు, ఫోర్లలో టాప్ 3లో ఉన్నదెవరో చూసేద్దం రండి...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) రసతవత్తరంగా సాగుతోంది. రోజు రోజుకూ అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతూ వస్తోంది. ఈ సీజన్‌లో చాలా మంది ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. కానీ.. మంచి ప్రదర్శన ఇస్తారని భావించిన కొంత మంది ఆటగాళ్ళు మాత్రం నిరాశ పరుస్తున్నారు. వీళ్లను భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించి కొన్నా.. వీరి ప్రదర్శన ఇప్పటివరకు పేలవంగా ఉంది. ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఇలాంటి 5 మంది ఆటగాళ్ల…
IPL Records: 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్‌లలో ఒకటిగా పేరొందింది. ఐపీఎల్‌లో అనేక దిగ్గజ ఆటగాళ్లు తమ ప్రతిభను చూపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇందులో ప్రతి సీజన్‌లో కొత్త రికార్డులు, కొత్త మైలురాళ్లు నమోదవుతుంటాయి. తాజాగా 2025 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ విశేషమైన రికార్డు సాధించాడు. ఈ సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ జట్టు…
MI vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో ముంబై వాంఖడే స్టేడియంలో నేడు రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్ (MI), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరుగనుంది. ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లో ముంబై కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఇక ఈ సీజన్ లో ఇప్పటి వరకు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై తొలి మ్యాచ్‌లో విజయ కేతనం ఎగుర వేసింది. గత 12 సంవత్సరాలుగా తొలి మ్యాచ్‌లో ఓటమి పాలవుతున్న ముంబై ఇండియన్స్ జట్టు.. ఈ ఏడాది కూడా అదే పరంపరను కొనసాగించింది.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) , ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ సేన 155 పరుగులు సాధించింది. సీఎస్‌కే విజయానికి 156 పరుగులు అవసరం. తిలక్ వర్మ 31 పరుగులు చేయగా.. కెప్టెన్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో మూడో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెపాక్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట ముంబై బ్యాటింగ్ చేయనుంది. కాగా.. హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్ రితురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్‌కే జట్టు కొత్త ఉత్సాహంతో ప్రవేశిస్తుంది. రెండు…
టీమిండియా బ్యాటింగ్ డైనమైట్ ఇషాన్ కిషన్ మాంచి ఫైర్ మీద ఉన్నాడు. బౌండరీలతో బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఐపీఎల్ 2024 తర్వాత పూర్తిగా విఫలమైన ఇషాన్ కిషాన్ తనేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఇషాన్ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో ఇతర జట్లకి హెచ్చరికలు పంపాడు. అదే తరహాలో మొదటి మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. ఇషాన్ కిషన్ అద్భుతమైన…
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. 18వ సీజన్‌లో భాగంగా నేడు రెండు టీంలు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు తలపడినప్పుడల్లా.. అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ రోజు కూడా అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే.. గత 12 సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ జట్టు తొలి మ్యాచ్‌లో గెలవకపోవడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా లేకుండా ముంబై ఇండియన్స్ ముందుకెళ్తోంది.…