ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని కలవడానికి ఓ అభిమాని గ్రౌండ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. "నేను కోహ్లీ సర్ పాదాలను తాకిన వెంటనే ఆయన నా పేరు అడిగి, 'జల్దీ సే భాగ్ జా (వేగంగా పారిపో)' అని చెప్పారు. అంతేకాకుండా.. భద్రతా సిబ్బంది నన్ను కొట్టవద్దని కూడా కోరారు" అని రీతుపర్ణో పఖిరా టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెల్లడించాడు.
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జట్టులో చోటు లభించకపోవడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తొలుత ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయానని.. కానీ జట్టు ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకున్నానని సిరాజ్ తెలిపాడు.
వెస్టిండీస్ హార్డ్ హిట్టర్, లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ నికోలస్ పూరన్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 600 సిక్సర్ల మైలురాయిని అధిగమించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 సిక్సర్లు బాదడంతో పూరన్ తన టీ20 కెరీర్‌లో 600 సిక్సర్ల మైలురాయిని అధిగమించాడు. దాంతో క్రికెట్‌లో అత్యంత భయంకరమైన హిట్టర్లలో తాను ఒకడినని నిరూపించాడు. నికోలస్ పూరన్ కంటే ముందు టీ20 క్రికెట్‌లో…
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌ను ఓడించింది. అశుతోష్ శర్మ (66 *), విప్రాజ్ నిగమ్ (39) కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఈ మ్యాచ్ అనంతరం అశుతోష్ తన ఇన్నింగ్స్‌ను గురువు శిఖర్ ధావన్‌కు అంకితం చేశాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్లో గుజరాత్, పంజాబ్ జట్లకు ఇదే మొదటి మ్యాచ్. ఈ నేపథ్యంలో విజయంతో టోర్నీని ఆరంభించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. గుజరాత్‌కు శుభ్‌మాన్ గిల్, పంజాబ్‌కు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నారు. గత సీజన్‌లో కోల్‌కతా నైట్…
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్‌గా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ వచ్చే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ఆట మొదలయ్యాక ఓపెనర్ ఎవరనే విషయం తెలుస్తుందన్నాడు. బట్లర్ వంటి ఆటగాడు ఏ స్థానంలో అయినా ఆడదానికి సిద్ధంగా ఉంటాడని తెలిపాడు. గుజరాత్ జట్టు పూర్తి ఫిట్‌గా ఉందని, ఎటువంటి గాయాలు లేవని గిల్ వెల్లడించాడు. నేడు పంజాబ్ కింగ్స్‌తో గుజరాత్ తలపడనుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30కు…
లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసక బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ నుంచే రికార్డు సృష్టించడం ప్రారంభించాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 సిక్సర్లు కొట్టాడు
LSGvsDC : ఐపీఎల్ 2025 టోర్నీ భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టంతో 209 పరుగులు సాధించింది. లక్నో జట్టు నుండి మిచెల్ మార్ష్ (72) , నికోలస్ పూరన్ (75) అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఢిల్లీ బౌలర్లపై…
Nicholas Pooran: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో లక్నో బ్యాటింగ్‌కు దిగింది. దాంతో బ్యాటింగ్ కు వచ్చిన లక్నో బ్యాట్స్మెన్లు మొదటి నుండే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ లు విధ్వంసకర ఇన్నింగ్స్ లతో ఢిల్లీ బౌలర్లకు చెమటలు పట్టించారు. Read Also: Crocodile In College:…
Rishabh Pant: వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. LSG బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇది ఇలా ఉంటే కెప్టెన్ రిషబ్ పంత్ అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఈ పోరులో పంత్ ఒక్క పరుగు కూడా చేయకుండా…