Nicholas Pooran: 6,6,6,6,4… ఒకే ఓవర్ లో పూరన్ ఊచకోత
- నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసిన లక్నో సూపర్ జెయింట్స్.
- విధ్వసం సృష్టించిన మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్
- 13వ ఓవర్లో సిక్స్‌ల వర్షం కురిపించిన నికోలస్ పూరన్
- ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 6, 4 బాదుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nicholas Pooran: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో లక్నో బ్యాటింగ్‌కు దిగింది. దాంతో బ్యాటింగ్ కు వచ్చిన లక్నో బ్యాట్స్‌మెన్లు మొదటి నుండే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ లు విధ్వంసకర ఇన్నింగ్స్ లతో ఢిల్లీ బౌలర్లకు చెమటలు పట్టించారు.
Read Also: Crocodile In College: ఐఐటీ బాంబే క్యాంపస్‌లో మొసలి కలకలం
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ముఖ్యంగా నికోలస్ పూరన్ తన పవర్ హిట్టింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్‌లో సిక్స్‌ల వర్షం కురిపించాడు పూరన్. తొలి బంతి డాట్‌గా ముగిసిన తర్వాత, వరుసగా 6, 6, 6, 6, 4 బాదేశాడు. ఈ దెబ్బకు ఒక్క ఓవర్లోనే లక్నో స్కోరు భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ వేసిన బంతికి పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పూరన్ 30 బంతుల్లో 75 పరుగులు సాధించి వెనుతిరిగారు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి.
THE NICHOLAS POORAN SHOW. 🔥pic.twitter.com/sbEk9dltBE
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2025
పూరన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడడానికి ఒక తప్పిదం కారణమైంది. వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన తర్వాత, అతను ఇచ్చిన క్యాచ్‌ను సమీర్ రిజ్వీ డ్రాప్ చేశాడు. ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్న పూరన్, మరింత దూకుడు పెంచి భారీ స్కోర్ సాధించాడు. ఈ సీజన్ మెగా ఐపీఎల్ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 16 కోట్లకు నికోలస్ పూరన్‌ను పెద్ద మొత్తంతో కొనుగోలు చేసింది. ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ చూసిన అభిమానులు నువ్వు తీసుకొనేదానికి న్యాయం చేసావని కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసింది లక్నో సూపర్ జెయింట్స్.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!