GT vs PBKS: గుజరాత్, పంజాబ్ ప్లేయింగ్ 11.. స్టార్ ఆటగాడికి చోటు కష్టమే!
- గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ ఢీ
- గుజరాత్‌కు గిల్, పంజాబ్‌కు శ్రేయాస్ నాయకత్వం
- గుజరాత్, పంజాబ్ ప్లేయింగ 11 టీమ్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్లో గుజరాత్, పంజాబ్ జట్లకు ఇదే మొదటి మ్యాచ్. ఈ నేపథ్యంలో విజయంతో టోర్నీని ఆరంభించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. గుజరాత్‌కు శుభ్‌మాన్ గిల్, పంజాబ్‌కు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నారు. గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపిన అయ్యర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
శుభ్‌మాన్ గిల్ వరుసగా రెండో సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. గుజరాత్ ఈసారి పూర్తిగా మారిపోయింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ జట్టులోకి వచ్చాడు. అతడు గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. మూడో స్థానంలో సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్ నాలుగో స్థానంలో ఆడనున్నారు. షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియాలు 5, 6 స్థానంలో వస్తారు. వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్ స్పిన్ విభాగంలో ఆడతారు. ఫాస్ట్ బౌలింగ్ కోటాలో కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు ఆడనున్నారు.
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
కోల్‌కతా ఓపెనర్లుగా ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్ ఆడనున్నారు. ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్ తరువాతి స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. అర్ష్ దీప్ సింగ్, మార్కో జాన్సెన్ పేస్ కోటాలో యుజ్వేంద్ర చహల్, హర్‌ప్రీత్ బ్రార్ స్పిన్ కోటాలో ఆడనున్నారు. పేసర్ లాకీ ఫెర్గూసన్ జట్టులో ఉండాలంటే జోష్ ఇంగ్లిస్ స్థానంలో నేహాల్ వాధేరా ఆడే అవకాశం ఉంది.
తుది జట్లు:
గుజరాత్: జోస్ బట్లర్, శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
కోల్‌కతా: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, అర్ష్ దీప్ సింగ్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చహల్, హర్‌ప్రీత్ బ్రార్.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!