ఐపీఎల్ 2025లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. సీఎస్కే ముందు 197 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2025లో వికెట్ల వెనుక చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ధోని చిరుతపులి వేగంతో ఫిల్ సాల్ట్‌ను స్టంప్ చేసి సీఎస్కేకు కీలకమైన బ్రేక్ అందించాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా.. ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు ఉండనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన సీఎస్కే ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2025లో భాగంగా.. కాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఐపీఎల్ 2025లో ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య ఆసక్తికర పోరు ఉండనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సాధించే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్‌పై 1053 పరుగులు చేశాడు. కేవలం ఐదు పరుగులు చేస్తే.. అతను చెన్నైపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవనున్నాడు.
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాట్స్‌మన్ అశుతోష్ శర్మ తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. క్లియర్ మైండ్‌సెట్‌తో మైదానంలో అడుగుపెట్టి.. పవర్ హిట్టింగ్ చేశాడు. మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 66 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఉత్కంఠభరితమైన విజయాన్ని అందించాడు.
న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అంటే అందరికీ సుపరిచితమే.. తన కూల్ నెస్, అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల మనసులను దోచుకున్నాడు. అయితే, ప్రస్తుతానికి కేన్ మామ.. క్రికెట్ మైదానంలో కాకుండా, మరో విధంగా అందరిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025లో అతను ఆడటం లేదు.. అయితే ఐపీఎల్ ప్రేక్షకుల కోసం అతను తనదైన శైలిలో సంతోషపరుస్తున్నాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు చెన్నైలోని చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌ను విజయాలతో ఆరంబించిన సీఎస్కే, ఆర్సీబీలు.. అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాయి. చెపాక్‌లో ఆర్సీబీపై ఘనమైన రికార్డు ఉన్న సీఎస్కేనే ఫెవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఓవైపు ఎంఎస్ ధోనీ, మరోవైపు విరాట్ కోహ్లీలు ఆడుతుండడంతో ఫాన్స్ ఈ మ్యాచ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చెన్నైతో మ్యాచ్‌కు ముందు బెంగళూరు బ్యాటింగ్ కోచ్ దినేష్…
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఫ్రాంచైజీ యజమాని కావ్యా మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేలం పాటను సైతం దగ్గరుండి చూసుకునే కావ్యా పాప.. ఎస్ఆర్హెచ్ ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరై ఆటగాళ్లను ప్రోత్సహిస్తుంటారు. ప్లేయర్స్ ఫోర్లు, సిక్సులు బాదినప్పుడల్లా తనదైన శైలిలో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ.. మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. అదే సమయంలో ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ వికెట్స్ కోల్పోయినప్పుడు డీలా పడిపోతారు. కావ్యా ఎక్స్ప్రెషన్స్కు క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతుంటారు. తాజాగా మరోసారి అదే…