IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ భారీ అంచనాల మధ్య ప్రారంభమైంది. 18వ సీజన్‌లో 10 జట్లు ట్రోఫీ గెలవడానికి పోటీపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు తమ అభిమాన జట్ల విజయాన్ని ఆస్వాదిస్తూ ఉత్సాహంగా ఈ క్రికెట్ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో కొత్త రికార్డులు నమోదవుతూ పాత రికార్డులు బద్దలవుతున్నాయి. అయితే, ఐపీఎల్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. అదేంటంటే.. ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడు టైటిళ్లు గెలిచిన ఏకైక ఆటగాడుగా లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ నిలవడం.
Read Also: Singareni : కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో విజిలెన్స్ తనిఖీలు…
ఉత్తరప్రదేశ్ లోని మీరఠ్‌కు చెందిన ఈ బౌలర్, మూడు వరుస సీజన్లలో ఛాంపియన్ జట్టులో భాగస్వామి కావడం విశేషం. అది ఎలా అంటే.. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ గెలుచుకుంది. ఆ సీజన్‌లో కర్ణ్ శర్మ విజేత జట్టులో ఒక భాగమయ్యాడు. ఆ సీజన్ లో అతను అంతగా ప్రభావం చూపించకపోయినా విజేత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
ఇక ఆ తర్వాతి ఏడాది 2017లో ముంబయి ఇండియన్స్ జట్టులోకి మారిన కర్ణ్ శర్మ ఆ సీజన్లో 9 మ్యాచ్ లు ఆడిన అతడు 13 వికెట్లు తీసి కీలక ఆటగాడిగా నిలిచాడు. మొత్తానికి ఆ సీజన్ లో ముంబై టైటిల్ గెలవడంలో అతని పాత్ర కీలకంగా మారింది. ఆ మరుసటి ఏడాది 2018లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు కర్ణ్ శర్మ. అయితే, ఈ సీజన్ లో అతడు 6 మ్యాచుల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఇలా అతడు వరుసగా 3 సార్లు ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండడంతో అతడు వరుసగా 3 ట్రోఫీలు అందుకున్న వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు.
Read Also: MI vs GT: గుజరాత్ భారీ స్కోరు.. ముంబై టార్గెట్ ఎంతంటే..?
ఇక మొత్తంగా ఐపీఎల్‌లో అతను 2013 నుంచి ఆడడం మొదలు పెట్టాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 84 మ్యాచ్‌లు ఆడి మొత్తంగా 76 వికెట్లు నేలకూల్చాడు. ఇక ప్రస్తుత 2025 ఐపీఎల్ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కర్ణ్ శర్మను మెగా వేలంలో రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది ముంబయి.
𝐓𝐇𝐄 𝐊𝐀𝐑𝐍 𝐒𝐇𝐀𝐑𝐌𝐀 𝐅𝐀𝐂𝐓𝐎𝐑 😉 #IYKYK
Welcome back home, Karn! 💙
All the updates from today’s auction proceedings, only on our Live Blog! 👉 https://t.co/r2Ig8mFtPi#MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPLAuction pic.twitter.com/v45Tw4Tsl8
— Mumbai Indians (@mipaltan) November 24, 2024