యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై మొదటి మ్యాచ్ ఆడిన వైభవ్.. 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 34 పరుగులు చేశాడు. బిహార్‌కు చెందిన వైభవ్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.1.10 కోట్లకు రాజస్థాన్…
LSG vs RR: ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ రాయల్స్‌పై 2 పరుగుల తేడాతో సెన్సేషనల్ విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లలో యశస్వి జైస్వాల్ 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రియాన్ పరాగ్ 39, వైభవ్ సూర్యవంశీ 34 పరుగులు చేశారు. చివరి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నేడు రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రాజస్థాన్ జట్టు నుంచి సంజు శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. అతని స్థానంలో రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కాగా.. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల…
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ 36వ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. రాజస్థాన్ జట్టు నుంచి సంజు శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్‌కు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జోస్ బట్లర్(97) చితక్కొట్టాడు. కానీ సెంచరీ చేయలేక పోయాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) రసతవత్తరంగా సాగుతోంది. రోజు రోజుకూ అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతూ వస్తోంది. ఈ సీజన్‌లో చాలా మంది ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. కానీ.. మంచి ప్రదర్శన ఇస్తారని భావించిన కొంత మంది ఆటగాళ్ళు మాత్రం నిరాశ పరుస్తున్నారు. వీళ్లను భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించి కొన్నా.. వీరి ప్రదర్శన ఇప్పటివరకు పేలవంగా ఉంది. ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఇలాంటి 5 మంది ఆటగాళ్ల…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-35లో గుజరాత్ టైటాన్స్ (GT) ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ కోల్పోయి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ను కైవసం చేసుకోవాలంటే గుజరాత్ 204 పరుగులు సాధించాల్సి ఉంటుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ అక్షర్ పటేల్(39) రాణించాడు.…
రాజస్థాన్ రాయల్స్‌కు సంజు శాంసన్ జట్టు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతున్నారు. ఈ ఇద్దరి సాథ్యంలో టీం ఏడు మ్యాచ్‌లు ఆడి, కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో కింది నుంచి మూడో స్థానంలో ఉంది. అయితే.. రాజస్థాన్ రాయల్స్‌కు సంబంధించి ప్రస్తుతం ఓ టాపిక్ వైరల్‌గా మారుతోంది. రాహుల్ ద్రవిడ్, సంజు శాంసన్ మధ్య విభేదాలు ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్…
మహేంద్ర సింగ్ ధోని.. చెన్నై సూపర్ కింగ్స్ .. ఈ రెండూ పర్యాయ పదాలు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి చెన్నై ఐకాన్‌గా ఉన్న ధోని.. ‘తలా’గా అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. సీఎస్కేను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనికి ఉన్న క్రేజ్ గురించి మాటల్లో వర్ణించడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. అయితే.. తాజాగా అశ్విన్ సైతం చెన్నై టీంకి కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం…