సొంతగడ్డపై బంతితో, బ్యాటుతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో గెలిచింది. 163 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడో విజయాన్ని అందుకుని ప్లేఆఫ్స్ రేసులో ఉంది. మరోవైపు ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించిన సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ చేరడం…
ఐపీఎల్ 2025లో 33వ మ్యాచ్ గురువారం ముంబై ఇండియన్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగిపోతోంది. క్రికెట్ లవర్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. భారత క్రికెట్ బోర్డ్ సైతం ఫిక్సింగ్ వ్యవహారంపై ఐపీఎల్ లోని 10 జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు 5 హాట్ ఫేవరేట్ టీమ్ ప్రాంచైజీలను కాంటాక్ట్ చేసినట్లు బీసీసీఐ ఆధారాలు సేకరించినట్లు టాక్ వినిపిస్తోంది. ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. Also…
లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్‌న్యూస్. పేస్ సంచలనం మయాంక్ యాదవ్ ఎట్టకేలకు ఫిట్‌నెస్ సాధించి జట్టుతో కలిశాడు. శనివారం (ఏప్రిల్ 19) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో మయాంక్ ఆడే అవకాశం ఉంది. మయాంక్ రాకతో లక్నో బౌలింగ్ బలం మరింత పెరిగింది. పేసర్లు శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేశ్ ఖాన్‌లకు మయాంక్ తోడవ్వనున్నాడు. మయాంక్ తుది జట్టులోకి వస్తే.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్న శార్దూల్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. 2024 ఐపీఎల్‌లో లక్నో…
DC vs RR : ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఊహించని ఉత్కంఠను అందించింది. రెండు జట్లు సమానంగా 188 పరుగులు చేసి స్కోరులో టై అయిన వేళ, మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇది 2021 తర్వాత ఐపీఎల్‌లో జరిగిన తొలి సూపర్ ఓవర్ కావడం విశేషం. ప్రధాన ఇన్నింగ్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188…
ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాల్సిందే అంటూ టీంలు పోటీ పడుతున్నాయి. మరోవైపు.. ప్రముఖ టీంలు, ఐదు సార్లు కప్పులు కొట్టిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెతికలపడ్డాయి. మన హోం జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పరాజయాలను ఎదుర్కొంది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలతో దూసుకువెలుతున్నాయి.
నేడు ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ లక్ష్యం 189 పరుగులు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ పోరెల్(49) అత్యధిక పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్(38), అక్షర్ పటేల్ (34), ట్రిస్టన్…
IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో ఒక షాకింగ్ వార్త క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక బడా వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నిస్తున్నాడని, దీనిపై అన్ని ఐపీఎల్ జట్లను అప్రమత్తం చేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) హెచ్చరిక జారీ చేసింది. ఈ వ్యాపారవేత్త ఐపీఎల్ జట్ల యజమానులు, ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లను కూడా టార్గెట్ చేస్తూ అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయడానికి ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని…
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 112 పరుగుల స్వల్ప ఛేదనలో కేకేఆర్ 15.1 ఓవర్లకు 95 పరుగులకే ఆలౌటై దారుణ ఓటమిని ఖాతాలో వేసుకుంది. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు పడగొట్టి కోల్‌కతా పతనాన్ని శాసించాడు. అయితే కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే రివ్యూ తీసుకోకపోవడం కేకేఆర్ విజయావకాశాలపై ప్రభావం…