రాజస్థాన్ రాయల్స్‌కు సంజు శాంసన్ జట్టు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతున్నారు. ఈ ఇద్దరి సాథ్యంలో టీం ఏడు మ్యాచ్‌లు ఆడి, కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో కింది నుంచి మూడో స్థానంలో ఉంది. అయితే.. రాజస్థాన్ రాయల్స్‌కు సంబంధించి ప్రస్తుతం ఓ టాపిక్ వైరల్‌గా మారుతోంది. రాహుల్ ద్రవిడ్, సంజు శాంసన్ మధ్య విభేదాలు ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా డగౌట్ దృశ్యాలతో కూడిన ఓ వీడియా ఈ వాదనకు బలాన్ని చేకూర్చింది.
READ MORE: Uttar Pradesh: కూతురి మామతో లేచిపోయిన నలుగురు పిల్లల తల్లి..
కాగా.. ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కి దారి తీసిన విషయం విదితమే. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ 19 బంతుల్లో 31 పరుగులు చేశాడు. పక్కటెముకల్లో నొప్పిగా కారణంగా.. రిటైర్ట్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌కు ముందు డగౌట్ దగ్గర ద్రవిడ్ బృందం జట్టుతో మాట్లాడుతుంటే సంజు తనకు సంబంధం లేనట్లుగా పక్కకు వెళ్తున్న వీడియో బయటకు వచ్చింది. మరో ఆటగాడు రమ్మని పిలుస్తున్నా.. తాను రాను అన్నట్లుగా చేతితో సంజు చేస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సూపర్ ఓవర్ చాలా కీలకం. ఈ ఓవర్‌కి ముందు డగౌట్‌లో ఆటగాళ్ల సమావేశం జరుగుతుంది. ఈ టైమ్‌లో జట్టు కెప్టెన్ సంజు పక్కకు వెళ్లడంతో జట్టులో ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఏదో జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ అంశంపై ఇటీవల రాహుల్ డ్రావిడ్ స్పందించారు. సంజుకు, తనకు ఎలాంటి విభేధాలు లేవని స్పష్టం చేశారు.
— Rajasthan Royals (@rajasthanroyals) April 19, 2025