మహేంద్ర సింగ్ ధోని.. చెన్నై సూపర్ కింగ్స్ .. ఈ రెండూ పర్యాయ పదాలు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి చెన్నై ఐకాన్‌గా ఉన్న ధోని.. ‘తలా’గా అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. సీఎస్‌కేను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనికి ఉన్న క్రేజ్ గురించి మాటల్లో వర్ణించడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. అయితే.. తాజాగా అశ్విన్ సైతం చెన్నై టీంకి కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ తాజాగా ధోని, చెన్నై టీం గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ఇలా ఎందుకు చేశాడు? అని ఫ్యాన్స్ మదిలో ప్రశ్న ఉత్పన్నమైంది.
READ MORE: Shine Tom Chako: షాకింగ్.. డ్రగ్స్ కేసులో షైన్ టామ్ చాకో అరెస్ట్
తాజాగా ఓ డిబేట్‌లో ప్యానలిస్ట్ ధోనీ, సీఎస్కే పేరును ప్రస్తావించాడు. ‘‘అశ్విన్.. నీకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. టీఎన్‌పీఎల్‌లో నీ జట్టును గెలిపించావు. నా లెక్క ప్రకారం ఇలాంటి నాయకత్వం చాలా అవసరం. ఆ నాయకుడు సంజు, శ్రేయస్, ధోనీలా ఉండాలి’’ అని ప్యానలిస్ట్ వ్యాఖ్యానించాడు. అప్పుడు అశ్విన్ స్పందిస్తూ ‘‘ష్.. ష్’’ అంటూ మాట్లాడేందుకు ఇష్టపడలేదు. మళ్లీ కలగజేసుకున్న ప్యానలిస్ట్ ‘‘కాదు. మీరు అలా అనొద్దు. నేను మాట్లాడొచ్చు. ఇక్కడ నేను ప్రేక్షకుడిగా మాట్లాడతా’’ అని అన్నాడు. దీనికి అశ్విన్ స్పందించాడు. ‘‘నేను మాత్రం నా టీమ్ గురించి మాట్లాడలేను’’ అని తేల్చి చెప్పేశాడు.
READ MORE: BJP MP: ‘‘సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంట్ మూసేయాలి’’.. వక్ఫ్ చట్టంపై బీజేపీ ఎంపీ..
ఎందుకు ఇలా చేశాడనే ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అశ్విన్ ఈ వ్యాఖ్య చేయడానికి బలమైన కారణం ఉంది. యూట్యూబ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే అశ్విన్ క్రికెట్ సంబంధిత నిపుణులతో పాటు చర్చల్లో పాల్గొంటుంటాడు. అయితే, ఐపీఎల్ ప్రారంభానికి ముందు తన యూట్యూబ్ ఛానల్‌లో నూర్‌అహ్మద్ కొనుగోలుపై కొందరు విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని తెచ్చిపెట్టాయి. దీంతో ఇకపై సీఎస్‌కే, ఆ టీం ప్లేయర్స్ గురించి తన ఛానెల్‌లో చర్చించకూడదని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.