తమ బౌలింగ్ విభాగం బాగుందని, ఓపెనింగ్ సరిగా లేదని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే తెలిపాడు. సరైన ఓపెనింగ్ లేక టోర్నమెంటంతా ఇబ్బంది పడుతున్నామన్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేదఐ పేర్కొన్నాడు. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ బాగా చేయలేదని, మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు కూడా నమోదు చేయలేకపోతున్నామని జింక్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. 8…
టీమిండియా యువ క్రికెటర్లలో శుభ్‌మన్ గిల్ ఒకడు. 25 ఏళ్ల గిల్ తన అద్భుత ఆటతో భారత జట్టులో సుస్థిర స్థానం సంపాధించాడు. టెస్ట్, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్‌లలోనూ కీలక ఆటగాడిగా ఉన్నాడు. అంతేకాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. తనదైన సారథ్యంతో ఐపీఎల్ 2025లో గుజరాత్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. దాంతో ప్రస్తుతం అతడు సోషల్ మీడియాలో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలో గిల్ ప్రొఫెషనల్ కెరీర్‌తో పాటు పర్సనల్…
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో తన అద్భుత బ్యాటింగ్‌తో అలరించే విరాట్.. సంబరాలు చేసుకోవడంలోనూ ముందుంటాడు. అది మనోడైనా, పగోడైనా.. కోహ్లీ ప్రతీకార సెలెబ్రేషన్స్ మరో లెవల్లో ఉంటాయి. ఇది మరోసారి రుజువైంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్‌పై కింగ్ తన ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇటీవల బెంగళూరును దాని సొంతగడ్డ…
CSK vs MI: ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 15.4 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపొందింది. ముంబై విజయానికి రోహిత్ శర్మ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025)లో ఈరోజు ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెన్నైని ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 36 మ్యాచ్‌లు విజయవంతంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు బ్యాటర్లు, బౌలర్లు, సిక్సర్లు, ఫోర్లలో టాప్ 3లో ఉన్నదెవరో చూసేద్దం రండి...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 డబుల్ హెడర్ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగ్ వేసింది. బరిలోకి దిగిన పంజాబ్ జట్టును 6 వికెట్లకు 157 పరుగుల స్కోరు చేసింది. ఆర్సీబీ7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. పడిక్కల్(61) దించికొట్టాడు. కింగ్ కోహ్లీ(71) వీర బాదుడు బాదాడు. వీరిద్దరూ మంచి భాగస్వామ్యం అందించారు. 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి…
టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్(IPL)లో చరిత్ర సృష్టించాడు. ఇవాళ 2025 మ్యాచ్ నంబర్-37లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముల్లన్‌పూర్ (న్యూ చండీగఢ్)లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘతన సాధించాడు. విరాట్ కోహ్లీ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో కోహ్లీకిది 59వ అర్ధశతకం. దీంతో…
నేడు బెంగళూరు, ఆర్సీబీ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ ఈసారి తన సొంతమైదానం ముల్లాన్‌పుర్‌లో ఈ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. పరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బెంగళూరు లక్ష్యం 158 పరుగులు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-37లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముల్లన్‌పూర్ (న్యూ చండీగఢ్)లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.