* నేడు సీఎం రేవంత్ జపాన్ షెడ్యూల్.. కిటాక్యూషు మేయర్ తో ఎకో టౌన్ ప్రాజెక్టుపై చర్చ.. మురసాకి రివర్ మ్యూజియం సందర్శించనున్న సీఎం రేవంత్.. ఎన్విరాన్మెంట్ మ్యూజియం, ఎకో టౌన్ సెంటర్ సందర్శన..
* ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన.. పలు అభివృద్ధి పనులకు భట్టి శంకుస్థాపన..
* నేడు ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఇవాళ ఉదయం 10 గంటలకి నోటిఫికేషన్, షెడ్యూల్ వివరాలు విడుదల.. నేటి నుంచి మే 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ.. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షలు..
* నేడు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు.. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలకు టీడీపీ శ్రేణుల ఏర్పాట్లు.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం పుట్టిన రోజు వేడుకలు..
* నేటి నుంచి గుజరాత్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన.. పలు ప్రాంతాల్లో అధ్యయనానికి వెళ్తున్న మంత్రి నారాయణ టీమ్.. రేపు సబర్మతి రివర్ ఫ్రంట్ ను పరిశీలించనున్న మంత్రి నారయణ బృందం..
* నేడు హైదరాబాద్ లో గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మారథాన్.. డ్రగ్స్, పాన్ మసాలాకు దూరంగా ఉండాలని పిలుపు.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న మెగాస్టార్ చిరంజీవి..
* నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. కొన్ని చోట్ల సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు..
* నేడు ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
* నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచులు.. మొదట ముల్లాన్ పుర్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకి పంజాబ్ కింగ్స్ తో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఇక, ముంబై వేదికగా రాత్రి 7.30 ముంబై ఇండియన్స్ తో ఢీ అంటున్న చెన్నై సూపర్ కింగ్స్..