ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ 36వ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. రాజస్థాన్ జట్టు నుంచి సంజు శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
READ MORE: Midhun Reddy: ప్రస్తుతం కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయి
ఈ రోజు ఓ ప్రత్యేకమైన ఆటగాడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆ యువ ఆటగాడి పేరు వైభవ్ సూర్యవంశీ. వైభవ్ వయసు 14 సంవత్సరాల 23 రోజులు మాత్రమే. ఐపీఎల్‌లో ఆడుతున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఈ యువకెరటాన్ని రాజస్థాన్ ఫ్రాంచైజీ మెగా వేలంలో రూ. 1.1 కోటికి కొన్నది. ఈ బీహార్ యువ ఆటగాడు, జనవరి 5, 2024న ఫస్ట్ క్లాస్‌లో అరంగేట్రం చేశాడు. అక్కడ అతను తన 2 ఇన్నింగ్స్‌లలో 31 పరుగులు చేశాడు.
READ MORE: CM Revanth Reddy : జపాన్‌లో ఉద్యోగ అవకాశాలకు తెలంగాణ యువతకు వేదిక.. TOMCOM కీలక ఒప్పందాలు
దీంతో అతను బీహార్ తరపున రంజీ ట్రోఫీలో ఆడిన రెండవ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ అయ్యాడు. బీహార్ తరపున వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లలో (10 ఇన్నింగ్స్‌లు) 100 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 41 పరుగులు. ఇటీవలి U-19 టెస్ట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లలో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. అక్కడ అతను 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇది భారతదేశ U19 ఆటగాడికి అత్యంత వేగవంతమైన సంచరీగా మారింది. మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు రనౌట్ అయ్యాడు. కాగా.. తాజాగా ఐపీఎల్‌లో రాణిస్తాడా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది.