ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు బాదాడు. మొయిన్ అలీ వేసిన 13 ఓవర్‌లో వరుసగా ఐదు బంతులను స్టాండ్స్‌లోకి పంపాడు. 13వ ఓవర్ మొదటి బంతికి హెట్‌మయర్ సింగిల్ తీసి ఇవ్వగా.. 2, 3, 4, 5, 6 బంతులకు రియాన్ పరాగ్ సిక్సులు బాదాడు. మొయిన్ ఓ…
ఐపీఎల్ 2025లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు పరుగుల తేడాతో గెలిచింది. ఓటమి ఖాయం అనుకున్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో.. ఆర్‌సీబీ అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. అదే సమయంలో కొంత మంది ఆర్‌సీబీ అభిమానులు సీఎస్‌కే ఫ్యాన్స్‌ను గేలి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ…
ఐపీఎల్ 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ చివరలో ఆండ్రీ రస్సెల్ (57 నాటౌట్; 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఊచకోత కోశాడు. ముందుగా 8 బంతుల్లో 2 పరుగులే చేసిన రస్సెల్.. ఆపై 17 బంతుల్లో 55 రన్స్ బాదాడు. విండీస్ హిట్టర్ ఫోర్లు,…
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ఓ జట్టుపై 50 సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన మహీ.. ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ముందున్నారు. పంజాబ్ (61), కోల్‌కతా (54)పై గేల్ 50 కంటే ఎక్కువ సిక్సర్లు…
అంతన్నారు, ఇంతన్నారు.. కాటేరమ్మ కొడుకులని ఆకాశానికి ఎత్తేశారు.. ఆరెంజ్ అంటే ఓ రేంజిలో ఉంటదని డీజేలు పెట్టారు, జేజేలు కొట్టారు. అన్నట్టే ఫస్ట్ మ్యాచే రాజస్థాన్ మీద రాయల్ విక్టరీ కొట్టారు. అంతే ఇగ ఖతం.. టాటా… గుడ్ బై!. పాయింట్ల పట్టికలో పైనున్న వాళ్లు ఠపీమని కిందపడిపోయారు, ఇంక లేవలేదు. ముక్కీ మూలిగీ మూడు మ్యాచ్‌లు గెలిచారు. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుని, అస్సాం రైలెక్కారు. కూకట్‌పల్లి క్లాసెన్ అన్నారు.. హయత్ నగర్…
ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోల్‌కతాకు అత్యంత కీలకం. గత మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించి ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. 10 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలే సాధించిన కోల్‌కతా.. రాజస్థాన్‌పై గెలిచి ప్లేఆఫ్స్ రేసులో నిలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం కేకేఆర్ పనైపోయినట్లే. ఐపీఎల్…
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఔట్ చేయడం తన అదృష్టం అని భారత బౌలర్ యశ్ దయాళ్ తెలిపాడు. చివరి ఓవర్‌లో ఫోకస్ అంతా బౌలింగ్‌పైనే పెట్టానని చెప్పాడు. ధోనీ వికెట్ తీయడంలో మరే ఉద్దేశం లేదని యశ్ దయాళ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యశ్ దయాళ్.. చెన్నై కెప్టెన్ ధోనీని ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. అప్పటి వరకు చెన్నై వైపు ఉన్న మ్యాచ్‌ను యశ్ అద్భుత…
చేతి వేలి గాయం కారణంగా పంజాబ్ కింగ్స్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ఇటీవల ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో మరో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ ఓవెన్‌ను పంజాబ్ జట్టులోకి తీసుకుంది. మిచెల్‌ను రూ.3 కోట్లకు పంజాబ్ తీసుకున్నట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2025లో మిచెల్ ఆడుతుండడం విశేషం. మే 9 వరకు పీఎస్‌ఎల్ 2025లో మిచెల్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 500 కంటే ఎక్కువ పరుగులు (ఓ సీజన్‌లో) చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఎనిమిదోసారి కోహ్లీ 500 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై హాఫ్ సెంచరీ చేయడంతో విరాట్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. అత్యధిక సీజన్‌లలో…
గుజరాత్ టైటాన్స్ పేసర్, దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబాడ డోపింగ్‌లో దొరికిపోయాడు. డ్రగ్స్ (నిషేధిత ఉత్ప్రేరకం) వాడినందుకు గానూ క్రికెట్ దక్షిణాఫ్రికా అతడిపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ విషయాన్ని రబాడ స్వయంగా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాడు. వినోదం కోసం తీసుకున్న డ్రగ్స్ కారణంగా తాను నిషేధాన్ని ఎదుర్కొంటున్నా అని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను ప్రొవిజనల్ సస్పెన్షన్‌లో ఉన్నానని, త్వరలోనే తిరిగి క్రికెట్ ఆడుతానని రబాడ చెప్పాడు. కగిసో రబాడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)…