Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు నిలకడగా ఆడిన ఆటగాడు అంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే అని చెప్పవచ్చు. 2008లో తొలి సీజన్ నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టుకు ఆడుతున్న కోహ్లీ తాజాగా చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆర్సీబీ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ అయినా ఓ వీడియోలో పోడ్కాస్ట్ షో లో భాగంగా కోహ్లీ మాట్లాడుతూ.. ఒక దశలో తాను జట్టు మారాలని ఆలోచించానని తెలిపాడు. కోహ్లీ తన…
తొలి ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు వరుసగా ఆరు విజయాల నుండి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో ముంబై వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ఇది మూడోసారి. ఈ సీజన్‌లో బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ టీంకు చేయూతనందిస్తున్నాడు.
DC vs SRH: హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనితో బ్యాటింగ్ మొదలు పెట్టిన ఢిల్లీ జట్టుకు మొదటి బంతికే వికెట్ పడింది. అలా మొదలైన బ్యాటింగ్ చివరి వరకు విఫలమైంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే డీసీకి ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి బంతికే కరుణ్ నాయర్ (0) వికెట్ కోల్పోయారు. వెంటనే ఫాఫ్ డుప్లెసిస్ (3), అభిషేక్ పోరెల్ (8) వరుసగా ఔటవుతుండటంతో జట్టు…
భారత పేసర్ మహ్మద్ షమీకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా హత్య బెదిరింపులు పంపిన దుండగులు.. రూ.కోటి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని షమీ సోదరుడు హసీబ్ సోమవారం ఓ జాతీయ మీడియాకు తెలిపాడు. ఆదివారం మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో మెయిల్ వచ్చిందని, వెంటనే ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం అని వెల్లడించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజ్‌పుత్ సిందార్ అనే వ్యక్తి మెయిల్…
ఐపీఎల్ 2025లో భారత స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్‌లో ఇదే తొలి సీజన్ అయినా.. దిగ్గజ బ్యాటర్లను సైతం తన స్పిన్ మయాజాలంతో కట్టడి చేస్తున్నాడు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ లక్నో సూపర్ జెయింట్స్‌కు అండగా నిలిస్తున్నాడు. ఇతను ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. అయితే దిగ్వేశ్ తన బౌలింగ్ కన్నా.. సంబరాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు రెండుసార్లు జరిమానా ఎదుర్కొన్న…
ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ జట్లు ముఖాముఖిగా 25 సార్లు పోటీ పడ్డాయి. 13 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించగా.. మరో 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది.
PBKS vs LSG: ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) బ్యాటర్లు సిక్సర్లతో రెచ్చిపోయారు. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా, పంజాబ్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పంజాబ్ జట్టు 236 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ తరఫున ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడు కేవలం 48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 91…
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ రెచ్చిపోయాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 రన్స్ చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. వరుస విరామాల్లో వికెట్స్ కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న వేళ పరాగ్ బ్యాట్ ఝులిపించాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆపై ఒక్కసారిగా గేరు మార్చేశాడు. ఒకే ఓవర్లో ఐదు…
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు ఉత్కంఠగా జరిగగా.. చివరికి 1 పరుగు తేడాతో కేకేఆర్ గెలుపొందింది. చివరి బంతికి మూడు రన్స్ అవసరం కాగా.. శుభమ్ దుబే ఒకే రన్ తీశాడు. ఛేదనలో ఆర్ఆర్ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఈ విజయంతో కోల్‌కతా ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు రాజస్థాన్…
ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌తో ఆకాష్ మహరాజ్ సింగ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. లక్నో తరపున అతడు బరిలోకి దిగనున్నాడు. మరోవైపు పంజాబ్ జట్టులోకి మార్కస్ స్టోయినిష్ తిరిగొచ్చాడు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లూ 10 మ్యాచ్‌లు ఆడాయి. పంజాబ్ 6 విజయాలు…