ఐపీఎల్ 2025లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు పరుగుల తేడాతో గెలిచింది. ఓటమి ఖాయం అనుకున్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో.. ఆర్‌సీబీ అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. అదే సమయంలో కొంత మంది ఆర్‌సీబీ అభిమానులు సీఎస్‌కే ఫ్యాన్స్‌ను గేలి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ సహనం కోల్పోయి బౌలర్‌కు చివాట్లు పెట్టిన వీడియో సైతం చక్కర్లు కొడుతోంది.
Also Read: KKR vs RR: రస్సెల్ ఊచకోత.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ లక్ష్యం!
ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్‌ను సీఎస్‌కే స్పిన్నర్ రవీంద్ర జడేజా వేయగా.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. కోహ్లీకి ఫీల్డ్ సెట్ చేసుండగా.. ఖలీల్ అహ్మద్ మాత్రం శ్రద్ధ లేకుండా తన స్థానం నుంచి పక్కకు జరిగాడు. ఖలీల్ చర్యతో మహీ సహనం కోల్పోయాడు. ‘అక్కడ ఫీల్డర్ ఉండటం ఎప్పుడైనా చూశావా ఖలీల్?’ అంటూ చివాట్లు పెట్టాడు. ఈ మాటలు స్టంప్ మైకులో రికార్డు అయ్యాయి. ఇక ఈ మ్యాచ్‌లో ఖలీల్ ధారాళంగా పరుగులు సమర్పించాడు. 3 ఓవర్లలోనే ఏకంగా 65 రన్స్ ఇచ్చాడు. పవర్ ప్లేలో రెండు ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చిన ఖలీల్.. 19వ ఓవర్లో 33 పరుగులు సమర్పించుకున్నాడు.