HCA President Jaganmohan Rao Scam: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. హెచ్‌సీఏ స్కామ్‌పై పూర్తి వివరాలు కావాలని తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ)ను ఈడీ కోరింది. హెచ్‌సీఏలో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేసింది. హవాలా, మనీ లాండరింగ్ రూపంలో లావాదేవీలు జరిగినట్టుగా ఈడీ అనుమానిస్తోంది. హెచ్‌సీఏ కమిటీ సభ్యులు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. బీసీసీఐ, ఐపీఎల్ ప్రాంచైజీ…
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కోసం జులై 6, 7వ తేదీల్లో వేలం నిర్వహించనున్నారు. దీంతో ఈ సీజన్లో తాను ఎలాగైనా ఆడాలని చెప్పి తన పేరును కూడా రిజిస్టర్ చేయించుకున్నాడు. ఎందుకంటే గత సీజన్లో ఆరు జట్లు మాత్రమే తలపడ్డాయి. కానీ, ఈ సీజన్లో మరో రెండు జట్లు కొత్తగా వచ్చి చేరాయి. దీంతో ఈ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మరింత రసవత్తరంగా సాగనుంది.
Bengaluru Victory Parade: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. 17 ఏళ్లుగా సాధ్యం కానీ ట్రోఫీని 18వ సీజన్లో ముద్దాడింది. దీంతో 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆర్సీబీ ప్లేయర్లకు ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
RCB: ఐపీఎల్-2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) గెలుపు తర్వాత, నిర్వహించి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అయితే, జూన్ 04న బెంగళూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీనే బాధ్యత వహించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) చెప్పింది. ఈ ఘటనపై ట్రిబ్యునల్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మ్యాచ్ ఆడుతుందంటే.. ఆటగాళ్ల కంటే ఎక్కువగా ఆ జట్టు సహ యజమాని కావ్య మారన్ పైనే అందరి కళ్లు ఉంటాయి. మ్యాచ్ జరుగుతున్నంతసేపూ ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లను ఉత్సహపరుస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం నిరాశగా ఉంటారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కావ్య పాపపై ఎక్కువగా మీమ్స్ వస్తూ ఉంటాయి. తాజాగా తనపై వచ్చే మీమ్స్‌పై స్పందించారు. క్రికెట్ మీద తనకున్న మక్కువ వల్లే తాను…
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఫైనల్స్ ఏ కలిసి రావడం లేదు. ఐపీఎల్ ఫైనల్ లో ఆర్సీబీతో జరిగిన టైటిల్ మ్యాచ్ లో అయ్యర్ సారధ్యం వహించిన పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. పదిరోజుల తర్వాత అయ్యర్ సారధ్యం వహించిన సోబో ముంబయి ఫాల్కన్స్ జట్టు ఫైనల్లో సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ పది రోజుల వ్యవధిలో అయ్యర్ రెండు సార్లు ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ ఫైనల్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అభిమానులకు షాకింగ్ న్యూస్. ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన ఆర్‌సీబీ ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్‌సీబీ యాజమాన్యం 'డయాజియో' ఫ్రాంచైజీని విక్రయించే అవకాశాలను పరిశీలిస్తోందట.
Bengaluru stampede case: బెంగళూర్‌లో ఆర్సీబీ విజయోత్సవ సభలో తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాట కేసులో అరెస్టులకు సంబంధించిన పిటిషన్లు విచారిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. జవాబుదారీతనం కోసం కోర్టు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు, దాని పర్యవసానాలపై తీవ్రమైన ప్రశ్నల్ని లేవనెత్తింది. కర్ణాటక ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని సూటిగా ప్రశ్నించింది. ఈ ఘటన దర్యాప్తును సీఐడీకి బదిలీ…
ఈ రోజు (జూన్ 10న) ఉదయం పంత్ వాషింగ్టన్ సుందర్ తో కలిసి నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా ఓ భారీ సిక్సర్ కొట్టాడు.. అది నేరుగా వెళ్లి స్టేడియం పైకప్పుకి తగలడంతో బద్దలైపోయింది. ఇక, పంత్ కొట్టిన ఈ భారీ సిక్సర్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుచుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంతో.. బెంగళూరు నగరంలో విక్టరీ పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో గ్రాండ్ సెలబ్రేషన్‌కు ప్లాన్ చేశారు. అయితే ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట జరిగి.. 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ఆర్సీబీపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. కొందరిని అరెస్ట్ కూడా…