IND vs ENG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కు ప్రాతినిథ్యం వహించిన రిషబ్ పంత్ పెద్దగా బ్యాటింగ్ లో రాణించలేదు. కానీ, చివరి రెండు లీగ్ మ్యాచ్ లలో రెచ్చిపోయి బ్యాటింగ్ చేయడంతో పాటు లాస్ట్ మ్యాచ్ లో అయితే, ఏకంగా సెంచరీ కొట్టాడు. అయితే, ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ కు ఎంపికైనా పంత్ గత వారం రోజులుగా నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇక, ఈ రోజు (జూన్ 10న) ఉదయం పంత్ వాషింగ్టన్ సుందర్ తో కలిసి నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా ఓ భారీ సిక్సర్ కొట్టాడు.. అది నేరుగా వెళ్లి స్టేడియం పైకప్పుకి తగలడంతో బద్దలైపోయింది. ఇక, పంత్ కొట్టిన ఈ భారీ సిక్సర్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.
Read Also: Fake Police Station: బీహార్‌లో ఫేక్ పోలీస్ స్టేషన్.. సంవత్సరం పాటు యథేచ్ఛగా దందాలు
మరోవైపు, ప్రాక్టీస్ సెషన్ లో టీమిండియా ప్లేయర్లు తీవ్రంగా శ్రమిస్తున్న వీడియోలను బీసీసీఐ తమ ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా , మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో కీలక సూచనలు చేయడం కనిపిస్తుంది. అయితే, ఈ సిరీస్ 2025 జూన్ నుంచి ఆగస్టు వరకు జరుగుతుంది. మ్యాచ్‌లు లీడ్స్‌లోని హెడింగ్లీ, బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్, లండన్‌లోని లార్డ్స్, ది ఓవల్, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియాల్లో జరగనున్నాయి.
Rishabh Pant breaking the roof with his six. 😲pic.twitter.com/ZkVjahRad6
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2025