Rishabh Pant: వేలంలో పంజాబ్ తీసుకుంటుందేమోనని టెన్షన్ పడ్డా: పంత్
- వేలంలో రిషబ్ పంత్‌కు రికార్డు ధర
- లక్నో కెప్టెన్‌గా పంత్
- పంజాబ్ కింగ్స్ ప్రాంచైజీపై పంత్ సెటైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ నియమితుడయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.27 కోట్ల రికార్డు ధరకు పంత్‌ను దక్కించుకున్న లక్నో.. అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలోకి వదిలేసిన సంగతి తెలిసిందే. సోమవారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పంత్ మాట్లాడుతూ.. వేలంలో పంజాబ్ కింగ్స్ ప్రాంచైజీ తీసుకుంటుందేమోనని టెన్షన్ పడ్డా అని సరదాగా అన్నారు.
‘వేలం రోజు నేను కాస్త టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్‌కు కారణం పంజాబ్ కింగ్స్. పంజాబ్ వద్ద అత్యధిక పర్సు మనీ ఉంది. శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ దక్కించుకోవడంతో నేను లక్నో టీమ్‌లో చేరగలనని అనుకున్నాను. లక్నోలో చేరేందుకు అవకాశం ఉంది కానీ.. చివరికి వేలంలో ఏం జరుగుతుందో తెలీదు కదా. దీంతో కాస్త టెన్షన్ పడ్డాను. భారీ ధర దక్కించున్నందుకు ఒత్తిడి ఏమీ లేదు. సంజీవ్ గోయెంకా ఆందోళన చెందనంత కాలం నాకు ఎలాంటి సమస్య లేదు. డబ్బు సంపాదించడం మంచిదే కానీ.. ప్రతి రోజు దాని గురించే ఆలోచించకూడదు’ అని రిషబ్ పంత్ తెలిపాడు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌లో ఒక జట్టు రిహాబ్ పంత్‌ను దక్కించుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. పంజాబ్ వద్ద అత్యధిక పర్స్ మనీ ఉండటం, రికీ పాంటింగ్ కోచ్‌గా వెళ్లడంతో పంత్‌ను కచ్చితంగా తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ వేలంలో పంజాబ్ రూ.26.75 కోట్లకు శ్రేయస్ అయ్యర్‌ను కైవసం చేసుకుంది. కాసేపటికే పంత్‌ను లక్నో రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!