ఐపీఎల్2023లో గెలుపుతో సంతోషంగా ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్ లో గాయపడిన స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ .. ఈ మెగా టోర్నీ మొత్తం దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. తొలుతా పంజాబ్ కింగ్స్-కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుండగా.. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిచింది.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఇప్పటికే సిద్దమైంది. ఇక సీజన్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, సీఎస్కేల మధ్య జరుగనుంది. అయితే అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. దీంతో సీజన్ లో తొలి మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.