పంజాబ్ కింగ్స్ (PBKS) ఐపీఎల్ 2023ను విజయంతో ఆరంభించింది. మొహాలీలో వర్షం కారణంగా మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ని పంజాబ్ 7 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా, ఆతిథ్య జట్టుకు భానుక రాజపక్స నాయకత్వం వహించడంతో నెమ్మదిగా ప్రారంభమైంది. రాజపక్స 32 బంతుల్లో 50 పరుగులు చేసి రెండో వికెట్‌కు కెప్టెన్ శిఖర్ ధావన్‌తో కలిసి 86 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ధావన్ 40 (29) పరుగుల వద్ద ఔట్ కాగా, సామ్ కుర్రాన్ 17 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేకేఆర్ తన మొదటి ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయడంతో పేలవమైన ప్రారంభం లభించింది. క్షణాల్లో తర్వాత నాథన్ ఎల్లిస్ ఒక వికెట్ పడగొట్టాడు. వెంకటేశ్ అయ్యార్, అండ్రూ రస్సెల్ ధాటిగా ఆడారు. ఎల్లిస్ వేసిన 14వ ఓవర్‌లో అయ్యర్ చెలరేగాడు. ఫ్రీ హిట్‌ను సిక్సర్‌గా మలిచాడు.
రెండో బంతికి రస్సెల్ బౌండరీ కొట్టాడు. ఆ తర్వాతి బంతికి అతను ఇచ్చిన క్యాచ్‌ను ప్రభుసిమ్రాన్ షార్ట్ లెగ్‌లో జారవిడిచాడు. అర్ష్‌దీప్ సింగ్ దెబ్బకు ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యార్ ఏడో వికెట్‌గా ఔటయ్యాడు. అర్ష్‌దీప్ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి అయ్యర్ కవర్స్‌లో రాహుల్ చాహర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే.. రసవత్తరంగా జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం పడుతుండడంతో పిచ్‌ను కవర్లతో కప్పేశారు. దీంతో.. వరుణుడు అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు. వర్షం పడే సమయానికి కేకేఆర్ 16 ఓవర్లకు 153 స్కోర్ చేయాలి. కానీ, ఆ జట్టు 7 పరుగులు వెనకబడి ఉంది.
Also Read : Bandi Sanjay : తెలంగాణ దేనికి మోడల్ కేసీఆర్..? రైతుల ఆత్మహత్యల్లోనా.. మాట తప్పడంలోనా..?