ఐపీఎల్ 16వ సీజన్ నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాంటింగ్‌కు దిగన ధోని సేనా నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. అయితే.. ఆ తరువాత 179 లక్ష్య ఛేదనకు బరిలో దిగిన గుజరాత్ ఆటగాళ్లు మొదటి నుంచి దూకుడుగా ఆడి విజయం సాధించారు. 25 పరుగులు చేసిన సాహా.. రాజవర్ధన్ హంగర్గేకర్ బౌలింగ్‌లో ఆవుటై.. మొదటి వికెట్‌ను సమర్పించుకున్నాడు.
Also Read : Viral : మొసలితో ఆట లాడితే అంతే ఉంటది.. మరి
అయితే.. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్( 36 బంతుల్లో 63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రషీద్ ఖాన్ మాత్రం ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం మూడు బంతుల్లోనే 10 పరుగులు సాధించాడు. ఇక సీఎస్‌కే బౌలర్లలో అరంగేట్ర బౌలర్ హంగర్గేకర్ మూడు వికెట్లతో అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్.. 9 సిక్స్‌లు, 4 ఫోర్లతో 92 పరుగులు చేశాడు. అయినప్పటికీ ఆతడి కష్టం వృధాగా మారింది.
Also Read : Off The Record: జోగయ్య జోస్యం ఫలిస్తుందా?