ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై, బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో, ఆర్సీబీ బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి దిగింది. ఓపెనర్లుగా వచ్చిన కోహ్లీ, ఫాప్.. మొదటి ఏడు ఓవర్ల వరకూ స్కోర్ బోర్డుని బాగానే లాక్కొచ్చారు. ఒక్క వికెట్ కూడా పడకుండా, ఏడు ఓవర్లలో 62 పరుగులు చేశారు. ఆ తర్వాత ఫాఫ్, మ్యాక్స్‌వెల్ వెనువెంటనే ఔట్ అవ్వడంతో.. ఆర్సీబీ స్కోర్ బోర్డ్…
మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరులో ఉన్న ఆ వైబ్రేషన్సే వేరు. కెప్టెన్‌గా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన ధోనీ.. ఐపీఎల్‌లోనూ తన చెన్నై జట్టుని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. తన కెప్టెన్సీలో ఆ జట్టుని నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఇప్పుడు తన పేరిట మరో రికార్డ్‌ని లిఖించుకున్నాడు. లీగ్ ఆరంభం నుంచే కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. బుధవారం (మే 4) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోరుతో సీఎస్కే తరఫున 200వ మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు.…
ఐపీఎల్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు పంజాబ్ కింగ్స్ బ్రేక్ వేసింది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 144 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్ శిఖర్ ధావన్ (62) మంచి ఆరంభం ఇచ్చాడు. మరో ఓపెనర్ బెయిర్ స్టో(1) త్వరగానే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాజపక్స(40) ధావన్‌కు మంచి సహకారం అందించాడు. రాజపక్స అవుటైనా ఆఖర్లో లివింగ్ స్టోన్(30) మెరుపులు…
పూణెలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. గుజరాత్ ఆటగాళ్లలో సాయి సుదర్శన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతడు 50 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 64 పరుగులు చేసి తుదికంటా నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లలో సాహా 21 పరుగులు, మిల్లర్ 11, రాహుల్…
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు ఎట్టకేలకు కొత్త కెప్టెన్ దొరికాడు. కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో అప్పటి నుంచి వెస్టిండీస్ జట్టుకు సంబంధించి వన్డేలు, టీ20లకు కెప్టెన్‌గా ఎవరిని నియమించాలో తెలియక విండీస్ క్రికెట్ బోర్డు సతమతం అవుతోంది. అయితే తాజాగా వెస్టిండీస్ వన్డే, టీ20లకు కొత్త కెప్టెన్‌ను విండీస్ బోర్డు నియమించింది. కొత్త కెప్టెన్‌గా నికోలస్ పూరన్‌ను ఎంపిక చేసింది. 2023 వన్డే ప్రపంచకప్ వరకు నికోలస్ పూరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. నికోలస్ పూరన్…
ఐపీఎల్‌లో ఈరోజు మరో ఆసక్తికర సమరం జరగనుంది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఆడేది తొలి సీజన్ అయినా గుజరాత్ టైటాన్స్ అద్భుత ఆటతీరు కనపరుస్తోంది. హార్డిక్ పాండ్యా నేతృత్వంలోని ఆ జట్టు ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటివరకు టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించి 16 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. మరో రెండు పాయింట్లు సాధిస్తే…
రంజాన్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా ఈద్ సంబరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు కూడా ఈద్ సంబరాలను నిర్వహించింది. ఈ క్రమంలో చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు ఈద్ సంబరాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో కొంతమంది చిన్నారులతో ధోనీ సరదాగా గడపడం…
ఐపీఎల్ 2022లో కోల్ కతాకు రిలీఫ్ లభించింది. వరుసగా ఎదురైన పరాజయాలకు బ్రేక్ పడింది. ఐదు వరుస పరాజయాల తర్వాత ఆ జట్టును గెలుపు వరించింది. సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి నాలుగో విజయాన్ని నమోదుచేసుకుంది. తొలుత రాజస్థాన్‌ను 152 పరుగులకు కట్టడి చేసిన కేకేఆర్ ఆ తర్వాత మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 5 బంతులు మిగిలి ఉండగానే గెలుపు బావుటా ఎగరేసింది. తొలుత…
ఐపీఎల్‌లో వరుసగా రెండు పరాజయాలతో డీలా పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మరోసారి గాయపడటంతో తర్వాతి మ్యాచ్‌లో అతడు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని హెడ్ కోచ్ టామ్ మూడీ వెల్లడించాడు. గతంలో సుందర్‌కు గాయమైన కుడి చేతికే మరోసారి గాయమైందని తెలిపాడు. గాయం కారణంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సుందర్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకుండానే మైదానాన్ని విడిచివెళ్లాడు. కాగా టోర్నీ ప్రారంభంలో…
ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపిస్తున్నాడు. ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. మైదానం నలువైపులా ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. దీంతో 57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 99 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో ఓవరాల్‌గా ఐపీఎల్‌లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 31 ఇన్నింగ్స్‌లలోనే రుతురాజ్ వెయ్యి పరుగులు సాధించాడు.…