IPL 2022: కోల్ కతాకు రిలీఫ్.. వరుస పరాజయాలకు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2022లో కోల్ కతాకు రిలీఫ్ లభించింది. వరుసగా ఎదురైన పరాజయాలకు బ్రేక్ పడింది. ఐదు వరుస పరాజయాల తర్వాత ఆ జట్టును గెలుపు వరించింది. సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి నాలుగో విజయాన్ని నమోదుచేసుకుంది. తొలుత రాజస్థాన్‌ను 152 పరుగులకు కట్టడి చేసిన కేకేఆర్ ఆ తర్వాత మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 5 బంతులు మిగిలి ఉండగానే గెలుపు బావుటా ఎగరేసింది. తొలుత టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్‌ను కోల్‌కతా బౌలర్లు 152 పరుగులకు నియంత్రించగలిగారు.
కావాల్సినన్ని వికెట్లు చేతిలో ఉన్నా భారీ స్కోరు సాధించడంలో ఆర్ఆర్ బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ సంజు శాంసన్ మాత్రం 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బట్లర్ 22, కరుణ్ నాయర్ 13, రియాన్ పరాగ్ 19, హెట్మెయిర్ 27 పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
16 పరుగులకే అరోన్ ఫించ్ (4) వికెట్‌ను, 32 పరుగుల వద్ద బాబా ఇంద్రజిత్ (15) వికెట్‌ను కోల్పోయినప్పటికీ ఆ తర్వాతి బ్యాటర్లు చక్కని భాగస్వామ్యాలు నెలకొల్పారు దీంతో కోల్ కతా విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 34 పరుగులు చేయగా, నితీశ్ రాణా 48, రింకు సింగ్ 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. కోల్‌కతా బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ సేన్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. కోల్‌కతా బౌలర్లలో సౌథీకి రెండు వికెట్లు దక్కగా, ఉమేశ్ యాదవ్, అనుకుల్ రాయ్, శివం మావీ తలా ఓ వికెట్ పడగొట్టారు. 23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 42 పరుగులు చేసిన కేకేఆర్ బ్యాటర్ రింకు సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐపీఎల్‌లో నేడు గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
IPL 2022: సన్‌రైజర్స్ టీమ్‌కు షాక్.. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ దూరం
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!