ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై, బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో, ఆర్సీబీ బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి దిగింది. ఓపెనర్లుగా వచ్చిన కోహ్లీ, ఫాప్.. మొదటి ఏడు ఓవర్ల వరకూ స్కోర్ బోర్డుని బాగానే లాక్కొచ్చారు. ఒక్క వికెట్ కూడా పడకుండా, ఏడు ఓవర్లలో 62 పరుగులు చేశారు. ఆ తర్వాత ఫాఫ్, మ్యాక్స్‌వెల్ వెనువెంటనే ఔట్ అవ్వడంతో.. ఆర్సీబీ స్కోర్ బోర్డ్ కాస్త నెమ్మదించింది.
Read Also: IPL: ‘డబుల్ సెంచరీ’ చేసిన ధోనీ
అటు కోహ్లీ కూడా నెమ్మదిగానే ఆడాడే తప్ప, మెరుపులేం మెరిపించలేదు. మహిపాల్ (27 బంతుల్లో 42 పరుగులు) ఒక్కడే మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మన్లకు పెద్దగా ఆడే స్కోప్ దొరక్కపోయినా, ఉన్నంతలో బాదేశారు. దీంతో.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ గెలవాలంటే, చెన్నైకి 174 పరుగులు చేయాల్సి ఉంటుంది. ధోనీ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జట్టులో పూర్వవైభవం వచ్చింది కాబట్టి, ఆ స్కోరుని ఈజీగా ఛేజ్ చేయొచ్చని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఆర్సీబీ బౌలర్స్ తమ స్పెల్‌తో మ్యాజిక్ చేస్తే, ఫలితాలు తారుమారు కూడా అవ్వొచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ!