ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి సంబంధించి క్లూస్ టీం విచారణ ముగిసింది. బీబీనగర్‌లో రైల్వే స్టేషన్‌కు వచ్చిన క్లూస్ టీమ్ మంటల్లో కాలిపోయిన బోగీలను తనిఖీ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే బోగీల నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. సైంటిఫిక్ నివేదిక తర్వాతే అసలు వివరాలు చెబుతామని అధికారులు చెప్పారు. ఎస్ 4 బోగీలోని బాత్‌రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని అధికారులు అనుకుంటున్నారు.
Read Also: Carrot Cultivation: క్యారెట్ ను ఇలా సాగు చేస్తే అధిక లాభాలను పొందవచ్చు..
కాగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య నిన్న (శుక్రవారం) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే 6 బోగీలు కాలిబూడిదయ్యాయి. అధికారులు, ప్రయాణీకులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ప్రయాణీకుల నిర్లక్ష్యమా, విద్రోహ కోణమా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
Read Also: Manipur: ఇంటర్నెట్ నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేయాలి.. మణిపూర్ హైకోర్టు ఆదేశం
కాగా.. హౌరా – సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి గవర్నమెంట్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. లోకోపైలట్ సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్గొండ జీఆర్‌పీ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేశారు. అగ్నిప్రమాదం జరిగిందని కేసు పెట్టారు. విచారణ తర్వాత సెక్షన్లు మారుస్తామని అధికారులు చెప్పారు.