డెన్మార్క్ రాణి మార్గరెట్-2 సింహాసనం నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగన్‌లోని క్రిస్టియన్ బోర్గ్ ప్యాలెస్‌లో సంబంధిత దస్త్రాలపై ఆమె సంతకం చేశారు. అనంతరం ఆమె పెద్దకుమారుడు ఫ్రెడెరిక్-10ను రాజుగా ప్రకటించారు
Housing Crisis: కెనడాలో హౌసింగ్ క్రైసిస్ తీవ్రమవుతోంది. అక్కడ ప్రజలు ఇళ్లు దొరక్క తెగ ఇబ్బందుల పడుతున్నారు. కెనడాలో పెరుగుతున్న నిరుద్యోగం, గృహ సంక్షోభంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలపై అక్కడి ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడుతూ.. విదేశీ విద్యార్థులపై పరిమితి విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు శనివారం వెల్లడించారు. అయితే ఎంతమేర పరిమితి విధిస్తారనే వివరాలను మంత్రి పేర్కొనలేదు.
ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ హత్యకు గురై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఆయన సమాధి సమీపంలో జరిగిన రెండు శక్తివంతమైన బాంబు పేలుళ్లలో కనీసం 73 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Pakistan: పాముకు పాలు పోసి పెంచిన విధంగా టెర్రరిస్టులను పాకిస్తాన్ పెంచిపోషించింది, ఇప్పుడు ఆ పాముకే బలైపోతోంది. ఆ దేశంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు, దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, సింధ్ వంటి ప్రాంతాల్లో ఉగ్రదాడులు నిత్యకృత్యమయ్యాయి. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా ఆర్మీ, పోలీసులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు.
టెక్ కంపెనీ గూగుల్‌కు బిగ్ షాక్ తగిలింది. ‘ఇన్‌కాగ్నిటో (Incognito)’ మోడ్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్ ట్రాక్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఓ కంపెనీ గూగుల్‌కు వ్యతిరేకంగా ‘క్లాస్ యాక్షన్ లా సూట్’ దాఖలు చేసింది. ఈ కేసు కాలిఫోర్నియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి య్వోన్నె గొనాలెజ్ రోజర్స్ ధర్మాసనం విచారించింది. అయితే మొదట ఈ కేసును కొట్టివేయాల్సిందిగా గూగుల్ చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి…
కష్టపడకుండ డబ్బు సంపాదించాడం ఏలా అని చాలా మంది కలలు కంటారు. అదే అభిప్రాయాన్ని బయటపెట్టిన వారికి కస్టేఫలి అనే సూక్తిని గుర్తు చేస్తూ క్లాస్ పీకుతుంటారు పెద్దలు. నిజానికి కష్టపడకుంటే ఏదీ సాధ్యం కాదు. ఇక డబ్బు సంపాదించడమనేది అసాధ్యమే. అదీ కూడా కోట్లు సంపాదించడమంటే అద్భుతమే అనాలి. అలాంటి అద్భుతమే ఇప్పుడు ఓ వ్యక్తి జీవితంలో జరిగింది. ఆయనే మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్. ఏ పనిచేయకుండా, ఏలాంటి కష్టం పడకుండా ఆయన…