పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో మంగళవారం జరిగిన బాంబు పేలుడులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన ముగ్గురు సభ్యులతో సహా నలుగురు వ్యక్తులు మంగళవారం మరణించారు.
భారత్ పొరుగు దేశాలపై చైనా ప్రభావం చూపుతుందని, ఇలాంటి పోటీ రాజకీయాలకు భారత్ భయపడాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం అన్నారు. ప్రతి పరిసరాల్లో సమస్యలు ఉన్నాయని, కానీ చివరికి పొరుగువారికి ఒకరికొకరు అవసరమని.. ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో మాల్దీవులతో ఉన్న సంబంధాల గురించి అడిగినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు.
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజుపై అభిశంసన తీర్మానం తీసుకొచ్చేందుకు మాల్దీవుల ప్రతిపక్షం సిద్ధమైంది. మొహమ్మద్ ముయిజ్జూ ప్రభుత్వంపై మాల్దీవుల్లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అభిశంసన ప్రక్రియను ప్రారంభించేందుకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రారంభించడానికి అవసరమైనంత సంతకాలను సేకరించింది.
Iran: ఇరాన్ తన ప్రధాన శత్రువు ఇజ్రాయిల్ కోసం గూఢచర్యానికి పాల్పడుతున్న నలుగురుకి ఉరిశిక్ష విధించింది. దోషులుగా తేలడంతో వారిని సోమవారం తెల్లవారుజామున ఉరితీసినట్లు టెహ్రాన్ న్యాయవ్యవస్థ తెలిపింది.
Iran: అమెరికా, వెస్ట్రన్ దేశాలకు మరోసారి ఇరాన్ షాక్ ఇచ్చింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పరిశోధన శాటిలైట్‌ని ప్రయోగించిన వారం రోజుల తర్వాత.. మూడు ఉపగ్రహాలను ఏకకాలంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇరాన్ ఆదివారం తెలిపింది. ‘‘ ఇరాన్ మూడు శాటిలైట్లను మొదటిసారిగా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు’’ అని ఆ దేశ మీడియా వెల్లడించింది. శాటిలైట్లను టూ-స్టేజ్ సీమోర్గ్(ఫీనిక్స్) ఉపగ్రహ వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ఈ ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల కనిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు తెలిపింది.
Iran: మరోసారి ఇరాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో టెన్షన్ నెలకొంది. ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముందుగా ఇరాన్, పాక్ బలూచిస్తాన్ లోని ఇరాన్ వ్యతిరేక మిలిటెంట్లపై వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత పాక్ ఇరాన్‌పై మిస్సైల్ అటాక్స్ చేసింది.