నేపాల్‌ను వరదలు ముంచెత్తాయి. నేపాల్‌లో ఒక నెలలోపే 47 మరణాలు నమోదయ్యాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించాయి, నేపాల్ హోం మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రాణనష్టంతో పాటు గణనీయ ఆస్తి నష్టం వాటిల్లింది.
ఇరాన్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందడంతో శుక్రవారం ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అతివాద నేత సయీద్ జలీలీ, సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్ మధ్య నెలకొంది.
విజయవాడ:బెజవాడ సీపీ, సర్కిల్ ఇన్స్ పెక్టర్ గుణరామ్ కి డిప్యూటీ సీఎం పవన్ ఫోన్. జంగారెడ్డి గూడెం కి చెందిన విద్యార్దిని అదృశ్యం కేసు విచారణ గురించి ఫోన్ చేసిన పవన్.