* ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న ఏపీ సీఎం.. ఉదయం 9 గంటలకు నీతి అయోగ్ సీఈవోతో సమావేశం.. 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ.. 10.45 గంటలకు జేపీ నడ్డాతో సమావేశం.. 11.30 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీకానున్న చంద్రబాబు..
* ఇవాళ్టితో ముగియనున్న సీఎం చంద్రబాబు మూడు రోజుల ఢిల్లీ పర్యటన. సాయంత్రం హైదరాబాద్ రానున్న చంద్రబాబు. రేపు తెలంగాణ సీఎం రేవంత్ తో భేటీ కానున్న ఏపీ సీఎం చంద్రబాబు.
* హైదరాబాద్: ఈరోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో రైతు భరోసా విధి విధానాలపై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
* అమరావతి: ఇవాళ రాజధానిలో పర్యటించనున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు. మంత్రుల క్వారర్ట్స్, ప్రజా ప్రతినిధుల నివాస సముదాయం సహా ఇతర కట్టడాలను పరిశీలించనున్న స్పీకర్. ఇప్పటికే 80 శాతం మేర పూర్తైన ప్రజా ప్రతినిధుల నివాస సముదాయ భవనం.
* హైదరాబాద్: నేడు తెలంగాణ భవన్ లో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం.. ఎల్లుండి జీహెచ్‌ఎంసీ మీటింగ్ ఉన్న నేపథ్యంలో.. కార్పొరేటర్లతో సమావేశం.
* తిరుపతిలో నేడు పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన.. సాయంత్రం పర్యటక రంగంపై పద్మావతి గెస్ట్ హౌస్ లో అధికారులతో సమీక్ష సమావేశం..
* ప్రకాశం : తాళ్లూరు, దొనకొండ మండల పరిషత్ కార్యాలయాల్లో సర్వ సభ్య సమావేశాలు, హాజరుకానున్న జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు
* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుంచి 11వ తేదీ వరకు తిరుమల ఎక్స్ ప్రెస్ రద్దు.. విజయవాడ సమీపంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో వారం రోజుల పాటు రైలు రాకపోకలను రద్దు చేసిన రైల్వే అధికారులు.. రాజమండ్రి మీదుగా తిరుపతి -విశాఖపట్నం మధ్య తిరిగే తిరుమల ఎక్స్ ప్రెస్ రద్దు విషయాన్ని ప్రయాణీకులు గమనించాలని కోరిన రైల్వే అధికారులు..
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఉదయం 11 గంటలకు రాజమండ్రి క్వారీ సెంటర్ లో ఉన్న బీజేపీ కార్యాలయంలో సోము వీర్రాజు ప్రెస్ మీట్
* కర్నూలు: నేడు మద్దికేర జడ్పీ స్కూల్ లో సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు.
* హైదరాబాద్: కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్. ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య.
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,826 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 27,530 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు
* పల్నాడు: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసుల పిటిషన్.. ఎన్నికల నేపథ్యంలో పల్నాడులో జరిగిన విధ్వంసాలు, హత్యాయత్నాలకు సంబంధించిన కేసులపై పిన్నెల్లిని పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉందని కోర్టులో పిటిషన్ వేసిన పోలీసులు.. మాచర్ల అదనపు జూనియర్ సివిల్ కోర్టులో జరిగిన వాదనలు.. తీర్పును నేటికి వాయిదా వేసిన న్యాయమూర్తి..