* హైదరాబాద్: నేడు అన్ని శాఖల సెక్రటరీలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం..
* కాకినాడ: నేడు జిల్లాలో రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. కలెక్టరేట్ లో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఆర్ డబ్ల్యూ ఎస్, అటవీ, పొల్యూషన్ అధికారులతో విడివిడిగా రివ్యూ నిర్వహించనున్న పవన్.. పెండింగ్ ప్రాజెక్టులు, శాఖాపరమైన సమగ్ర సమాచారంతో రావాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్.. సాయంత్రం గొల్లప్రోలులోని తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న పవన్
* నాగర్ కర్నూల్: నేడు అచ్చం పేట నియోజక వర్గంలో మంత్రి సీతక్క పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీతక్క
* ఖమ్మం: నేడు జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటన… సీతారామ ప్రాజెక్టు పనులు పరిశీలన
* భద్రాద్రి కొత్తగూడెం: నేటి నుంచి భద్రాచలం రామాలయంలో బ్రేక్ దర్శనం అమలు.. 200 రూపాయల టికెట్ తో ఉదయం 9 గంటల నుంచి 9.30 వరకు, రాత్రి 7 గంటల నుంచి 7.30 వరకు భక్తులకి బ్రేక్ దర్శనం
* విజయవాడ: నేడు బెంగుళూరు నుంచి తాడేపల్లి నివాసానికి రానున్న వైఎస్ జగన్.. బెంగుళూరు నుంచి మధ్యాహ్నం 3.15కి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న మాజీ సీఎం
* నెల్లూరు జిల్లా: ఆత్మకూరులో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఫ్రీ సీట్లు కేటాయింపు జీవో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉచిత విద్య విదార్థుల తల్లిదండ్రుల సంఘం ఆందోళన
* తిరుమల: శ్రీవారి ఆలయంలో తిరిగి విశేష పూజ ప్రారంభించాలన్న ప్రధాన అర్చకులు.. స్వామివారికి సమర్పించే ప్రసాదాల దిట్టాని పెంచాలని సూచన.. దర్మగిరి వేదపాఠశాల విద్యార్దులుకు అప్రెంటిస్ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి
* కర్నూలు: హాలహర్వి మండలం ఛత్రగుడి ఆంజనేయ స్వామి కళ్యాణ మండపంలో వైసీపీ సమావేశం, పాల్గొననున్న ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి…
* శ్రీ సత్యసాయి : ధర్మవరం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం.హాజరు కానున మంత్రి సత్య కుమార్ యాదవ్….
* తిరుమల: 10 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకేన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న75,449 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 27,121 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు
* నేడు విశాఖ సెంట్రల్ జైలుకు హోం మంత్రి వంగల పూడి అనిత.. జైలులో ఖైదీల స్థితిగతులు, సమస్యల పరిశీలన..
* అనంతపురం : నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నేడు సీపీఎం జిల్లా కార్యాలయంలో ఉమ్మడి సమావేశం.
* విశాఖ వేదికగా సీపీఐ రాష్ట్ర సమితి ప్రారంభ సమావేశం… ముఖ్య అతిథిగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ