AP Inter Exam Schedule: ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలలో జరిగే ఫస్ట్, సెకండ్ ఇయర్ ఇంటర్మిడీయట్ పరీక్షల టైం టేబుల్ ను బోర్డు ఆఫ్ ఇంటర్మిడియట్ ఎడ్యూకేషన్ కార్యదర్శి నారాయణ భరత్ గుప్తా విడుదల చేశారు.
TG Inter Board : తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ విద్యలో పలు మార్పులను ప్రతిపాదించింది. ఆర్ట్స్ గ్రూప్‌లతో పాటు భాషా సబ్జెక్టుల్లో కూడా ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు భావిస్తోంది. మొత్తం 100 మార్కుల్లో 20 మార్కులను ప్రాజెక్టులు లేదా అసైన్‌మెంట్‌ల రూపంలో ఇంటర్నల్‌గా కేటాయించి, మిగతా 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం ఆమోదం ఇస్తే, సైన్స్ గ్రూప్‌లతో పాటు ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులకు కూడా…
Inter Supplementary : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 4,12,724 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ఫస్ట్ ఇయర్ జనరల్ కోర్సులో 2,49,032 మంది, ఒకేషనల్ కోర్సులో 16,994 మంది ఉన్నారు. రెండవ సంవత్సరం జనరల్ కోర్సుకు 1,34,341 మంది, ఒకేషనల్ పరీక్షలకు 12,357 మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. గత నెల (ఏప్రిల్ 22) విడుదలైన ఇంటర్ ఫలితాల్లో…
AP Inter Exams: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ఈరోజు (మార్చ్ 1) ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే, ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఇక, తొలి రోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ద్వితీయ భాషపై పరీక్ష జరగనుంది.
తెలంగాణలోని జూనియర్ జాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రేపటి(నవంబర్ 6) నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశాన్ని కల్పించింది. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 4 వరకు అవకాశాన్ని కల్పించారు
TS Inter Exams: ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడినా.. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. పరీక్షల్లో తప్పుడు విధానాలకు పూర్తిగా స్వస్తి పలుకుతూ..
Intermediate Exams: ఇంటర్ పరీక్షలకు సమయం దగ్గర పడింది.. ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 15వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్నాయి.. అయితే, ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.. ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో…
ఏపీలో ఇంటర్ పరీక్ష వాయిదా పడ్డాయి. రేపు (మే 11) జరగాల్సిన ఇంటర్ పరీక్షని ఈనెల 25కి వాయిదా వేసినట్టు అధికారులు వేసినట్టు తెలిపారు. అసని తుఫాన్ కారణంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు బోర్డ్ ప్రకటించింది. కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ తీవ్రరూపం దాల్చి తీరం వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, కాకినాడకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను కారణంగా ఈ రోజు రాత్రి…
తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో భాగంగా.. ఈరోజు జరిగిన సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షకు 20,921 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 4,37,865 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 4,16,964 మందే పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. మొత్తంగా 4.7% విద్యార్థులు గైర్హాజరైనట్టు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇండిర్మీడియట్ ఎడ్యుకేషన్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్‌లలో ఒక్కోటి చొప్పున మూడు మాల్ ప్రాక్టీస్ కేసులు…