Kadapa Crime: ఇంటర్ ఫెయిలైన కూతురు.. అవమానంతో తల్లి ఏం చేసిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Commits Suicide In Kadapa For Daughter Failing In Inter Exams: పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో లేక ఫలితాలు రాకముందే ఫెయిల్ అవుతామేమోనన్న భయంతోనో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. అయితే.. కడపలో కూతురు ఫెయిలైందని, తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటు చేసుకుంది. కూతురు ఫెయిల్ అవ్వడాన్ని అవమానంగా భావించిన తల్లి.. రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కడపలోని ఏఎన్నార్ నగర్‌కు చెందిన గౌతమి.. ఇటీవల రాసిన ఇంటర్ పరీక్షల్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన తండ్రి.. కోపంలో గౌతమిని మందలించాడు. ఎలా ఫెయిల్ అయ్యావని ప్రశ్నించాడు. కాలేజీకి వెళ్లి చదువుకోకుండా ఏం చేశావ్? అంటూ మండిపడ్డాడు.
Pakistan : సంసార సుఖం కోసం బల్లి నుంచి ఆయిల్.. ఎగబడి కొంటున్న జనం
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
దాంతో గౌతమి తీవ్ర మనస్తాపం చెందింది. తండ్రి మాటలను తట్టుకోలేకపోయింది. తన పరువు పోయేలా తండ్రి మాటలనడంతో.. గౌతమి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అటు.. గౌతమి పరీక్షల్లో ఫెయిల్ కావడం, ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో.. తల్లి ఆదిలక్ష్మి అవమానంగా భావించింది. కూతురు ఎక్కడికి వెళ్లిందోనని దిగులు కూడా ఆమెని కలచివేసింది. ఈ బాధని దిగమింగుకోలేకపోయింది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా, చౌటపల్లె రైల్వేక్రాస్ వద్ద గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న ఆమె కుటుంబ సభ్యులు.. బోరున విలపిస్తున్నారు. అటు.. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. గౌతమి ఎక్కడికి వెళ్లిందన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు.
Chennai Customs : దీని దుంప తెగ.. లగేజీ నిండా భయంకరమైన పాములు
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!